Month: January 2026

నీ ఆగమనంలో విరిసిన మోము

నీ ఆగమనంలో విరిసిన మోము

నీ ఆగమనంలో విరిసిన మోము పూవుల వసంతాల మనస్సుతన విదేశీయానం ముగింపుతన రాకడకై దిగులు కళ్ళ నిరీక్షణతను లేని దినాలు ముళ్ళ లోగిళ్ళుఅనురాగం ప్రేమ కోల్పోయిన హృదయంతనువు మనస్సు తనకై తపనతన సుదూరాలు హృదయం కోసిన వేదనఆగిఆగి కురిసే గాలివాన హృదయంలోతన ఉద్యోగ ధర్మం ఓ గులాబీ ముళ్ళుతనకై అక్షరీకరించలేని ఎదురుతెన్నులుతన ఊపిరిబాసల కోసం సంవేదనకెరటాలు కెరటాలుగా ఆలోచనల అలజడిఈ రేయి మూసుకున్న తలపులు తెరుచుకునిఅక్షరాలను ఒడిసిపట్టి ఆనందం పిండినట్లుఈ రేయి వెలుగు దీపం తన రాకడకైగతించిన రోజులలో రోజాలు పుష్పిస్తూనింగిలో నక్షత్రాలను లెక్కిస్తున్నాయినా మోము వాడిపోయిన మరుమల్లియనీవు ఏతెంచిన అలికిడిలోనా కళ్ళల్లో గుబులు సంగీతాలునీ ఆలింగనంలో కారుమబ్బులు విడిపోతూనీ ప్రయాణం బడలిక తీరేందుకుఆనంద భాష్పాల వేన్నీళ్ళు స్నానానికైప్రియా నీ రాకడ కమ్మని తేనీయలు,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
గణతంత్ర దినోత్సవంసందర్భంగా వ్యాసం

గణతంత్ర దినోత్సవంసందర్భంగా వ్యాసం

అక్షరలిపిగణతంత్ర దినోత్సవంసందర్భంగా వ్యాసం భారతదేశంలోని ప్రజలు ప్రతి సంవత్సరం జనవరి 26 న గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ పండుగగా ఘనంగా జరుపుకుంటారు. గణతంత్ర దినోత్సవం భారత దేశ ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. 1947 ఆగస్టు 15 న మన దేశానికి స్వాతంత్ర్యం లభించినప్పటికీ, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతోనే భారతదేశం నిజమైన గణతంత్ర దేశంగా అవతరించింది. భారత రాజ్యాంగాన్ని డా. బీ.ఆర్. అంబేడ్కర్ అధ్యక్షతన రాజ్యాంగ సభ రూపొందించింది. ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. ఇందులో ప్రతి పౌరుడికి సమాన హక్కులు, మౌలిక స్వేచ్ఛలు, మౌలిక కర్తవ్యాలు పొందుపరచబడ్డాయి. కులం, మతం, భాష అనే తేడాలు లేకుండా అందరికీ సమానత్వం కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.గణతంత్ర దినోత్సవం రోజున న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగే పరేడ్ దేశ గౌరవాన్ని పెంచుతుంది. భారత సైన్యం తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తే, వివిధ…
Read More
కొండవీటి వెంకటకవి(ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త)

కొండవీటి వెంకటకవి(ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త)

కొండవీటి వెంకటకవి (జనవరి 25, 1918 - ఏప్రిల్ 7, 1991) ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత.వెంకట కవి గుంటూరు జిల్లా విప్పర్ల (క్రోసూరు) గ్రామంలో జన్మించారు. వీరు నారాయణ, శేషమ్మ దంపతులకు జనవరి 25, 1918 సంవత్సరంలో జన్మించారు. వీరి అసలు పేరు కొండవీటి వెంకటయ్య. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసము తండ్రివద్ద జరిగింది. ఆ తరువాత నరికొండ నమ్మాళరాజు వద్ద సంస్కృత కావ్య పఠనము చేశారు. చిట్టిగూడూరు నరసింహ సంస్కృత కళాశాలలో చేరి దువ్వూరు వేంకటశాస్త్రిగారి శిశులై బాషా ప్రావిణపట్టా పొందారు. వసుచరిత్ర అవలీలగా పాడి వినిపించేవాడు. భట్టుమూర్తి అంటే ఆయనకు విపరీత ప్రేమాభిమానం. 1936లో కిసాన్ కాంగ్రేసుకు సహాయకార్యదర్శిగా పనిచేశాడు.1944-45లో సత్తెనపల్లి లో శరభయ్యగుప్త హైస్కూల్లో తెలుగు పండితునిగా ఉద్యోగం ప్రారంభించారు. 1946 నుండి 1952 వరకు వెంకటకవి జిల్లా మాచర్లలో బోర్డు ఉన్నతపాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశాడు. 1952నుంచి పొన్నూరు భావనారాయణ స్వామివారి సంస్కృత…
Read More
సోమర్ సెట్ మామ్, బ్రిటిష్ నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత)

సోమర్ సెట్ మామ్, బ్రిటిష్ నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత)

విలియం సోమెర్‌సెట్ మామ్‌, (25 జనవరి 1874 – 16 డిసెంబరు1965), డబ్ల్యూ. సోమెర్‌సెట్ మామ్‌ గా సుప్రసిద్ధుడు. అతడు బ్రిటిష్ నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత. 1930లలో అనేక ప్రసిద్ధ రచనలు చేసాడు. విలియం సోమర్ సెట్ మామ్, 1874 జనవరి 25న తేదీన పారిస్ లో జన్మించాడు. ఆయన తాత ముత్తాతలకిమల్లై ఆయన తండ్రి కూడా న్యాయవృత్తినే స్వీకరించి, బ్రిటిష్ రాయబార కార్యాలయంలో సలహాదారునిగా పనిచేసేవాడు. ఆయన ఎన్నెన్నో దూరప్రాంతాలు తిరిగేవాడు. దిష్టి తగలకుండా, అరిష్టాన్ని వారించే ఒక గుర్తుని- ఒంపుతిరిగి ఏసుసిలువను స్ఫురింపజేసే గుర్తును మొరాకో నుండి తెచ్చాడు. ఈగుర్తునే తన పుస్తకాలపైన ఇంటిముందూ వాడుతూ వచ్చాడు సోమర్ సెట్. మామ్ తల్లి సౌందర్యవతి, తండ్రి కురూపి. వారిని ఇరుగు పొరుగు వారు "బ్యూటీ అండ్ ద బీస్ట్" అని చలోక్తిగా వ్యవహరించేవారట. మామ్ తల్లి ఆరుగురు మగ పిల్లల్ని కని, 38వ…
Read More
రవివర్మ

రవివర్మ

పరిపక్వమైన జీవితం అనుభవాల్లోంచి సహజమైన ప్రేమలు ఉద్బవిస్తాయి.ప్రేమ ఒకరి అంతరంగంలోకి ఒకరు తొంగిచూసి అర్ధంచేసుకుని అవిభాజ్యంగా అర్దనారీశ్వరీ తత్వంగా కలిసి జీవించే సుందరమైన రవివర్మ చిత్రీకరించిన కళాఖండం ప్రేమలు అంటే.,,,,,,,అపరాజిత్సూర్యాపేట
Read More
ఎరుపెక్కిన పూవులు అక్షరాలు

ఎరుపెక్కిన పూవులు అక్షరాలు

ఎరుపెక్కిన పూవులు అక్షరాలు గుండెల్లో శూలం గుచ్చుకున్నట్లుకళ్ళల్లోంచి కన్నీటికి బదులు రక్తం శ్రవిస్తున్న చప్పుడు,,,,,కళ్ళల్లో ఎరుపెక్కిన అక్షరాలు ఎర్రమల్లెలు,,,,,వేళ్ళల్లో కలం పొసగక బలహీనమైన కరములు కర్రలు,,,,,,మనస్సు గూడులో నిక్షిప్తమైన నా అక్షరాలు బయటకు రాక నానా అవస్థలు,,,,,,నేను నీ గుండెల్లో గురిచూసి తూటాలు పేల్చినట్లు అక్షరాలు ప్రతిధ్వనిస్తే లక్ష్యం సిద్దించినట్లు,,,,నా కవిత్వం వీణుల విందుగా గాక ఆలోచింపజేష్తుంది,,,,,నీ మనస్సు ఎడారి ఇసుక సముద్రం మంటల్లో ఎడారి ఓడనై అక్కున చేర్చుకుని దిశానిర్దేశం చేస్తాను,,,,,,ఎన్నెన్నో కలలు కల్లలైనా స్మృతి వనంలో నా కళ్ళు రచించే అక్షరాలు తిమిరాలకు చరమగీతాలు,,,,ఈ అగ్నిమంటల గుండెల్లో ఎర్రగులాబీలు పూసేది నీ ఆత్మసంఘర్షణ దూరం చేసేందుకు,,,,,,దేశానికి స్వాతంత్య్రం సాధించిన యోధులు అమరులై పక్వమైన ఫలాలు అందించారు,,,,,,కవుల కలాల్లో అక్షరాలు పూసేది భారతావని నందనవనం చేసేందుకు,ఆకలి కేకలు లేని సుందర భరతఖండం కోసం,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం

భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు. జనవరి 26 నే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రికమైన కారణం ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్‌ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు. భారతదేశానికి సంబంధించిన మూడు జాతీయ సెలవుదినాల్లో ఇది కూడా ఒకటి. ఇది కాక భారత స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి మిగిలిన…
Read More
కవిత

కవిత

కవిత నీ చూపే నాకు మొదటి పరిచయంనీ ఊపిరే నా ఊపిరి,నీ దగ్గర ఉన్నప్పుడుప్రపంచమే మౌనంగా మారిపోతుంది.నీ నడకలోనే సంగీతం,నీ మాటల్లోనే మత్తు,నీ నవ్వులోనేనా జీవితానికి అర్థం.గాలి తాకితేనీ పరిమళమే తాకినట్టు,చీకటిలోనూనీ కళ్ల వెలుగే దారి చూపుతుంది.నీ చేతి తాకిడిలోనాకు భయం కరుగుతుంది,నీ ఒడిలోప్రపంచం మరిచిపోతుంది.నీ బుగ్గల ఎరుపునా ప్రేమకి రంగు,నీ నుదిటి కుంకుమనా జీవితానికి సంకేతం.నువ్వు అలిగితేనన్ను నేనే మర్చిపోతాను,నువ్వు నవ్వితేనేను నేనుగా మారిపోతాను.నిన్ను ప్రేమించడంఅది నా శ్వాస,అది నా ప్రార్థన,అది నా జీవితం.నువ్వు లేకపోతే నేను లేను,కానీ మనం ఇద్దరం కలిస్తేఅదే ప్రేమ…అదే శాశ్వతం… ❤️ ShivRmShnkr ✍️
Read More
అక్షరాలు వెన్నెలలు

అక్షరాలు వెన్నెలలు

అక్షరాలు వెన్నెలలు మంచి సాహిత్య అధ్యయనం మనస్సు పూసిన ఇంద్రధనస్సు.మనస్సు వెన్నెల సముద్రమై వసంతాలన్నీ నీకోసం దిగివస్తాయి. అప్పటి వరకు నిన్ను చుట్టుముట్టి ఏకాకిని చేసిన దుర్దినాలు తొలగిపోతాయి. జీవితంలో అనుభవించిన దుఃఖిత కారుచీట్లు తొలగిపోతాయి.సంక్లిష్ట సమస్యలను కుశాగ్రబుద్దితో సులువైన మార్గాలతో పరిష్కరిస్తావు.నీవే జాబిలి నీవే వెన్నెలలా మంచి పుస్తకాలు, మానవతా విలువలున్న సాహిత్యం అధ్యయనం చేయి.నీ హృదయంలో రంగు రంగుల గుభాళించే పూవుల స్వచ్ఛతను ఆహ్లాదాన్ని నింపుకో.సోమరితనం మత్తువదలి అక్షరాలతో సహవాసం చేయి, ఉద్రేకం ఉన్మాదం సద్దుమణిగి జీవితం సెలయేటి గలగలల్లా సాగిపోతుంది. అపరాజిత్సూర్యాపేట
Read More
వీర సైనికుడా

వీర సైనికుడా

వీర సైనికుడా,,,,,,,,!! సైనికుడా మంచుకొండల్లో వీచే నరాలు కొరికే చాలిగాలుల్లో ఒంటరివై ప్రాణం ఉగ్గబట్టుకుని దివారాత్రులు సరిహద్దుల్లో సంచరించే వీరుడా,,,,,,,,,,దేశభక్తికి ప్రాణం పోసిన వీరుడా సమయానికి ఆహారం అందకున్నా వీచే చాలిగాలుల్లో ప్రాణవాయువు కరువు ఎందుకంటే అతి ఎత్తయిన శిఖరాలు కదా విహంగాలు కూడా సంచరించవు ,,,,,,,,,,,,,,,,,సైనికుడా చలిమంట కూడా వేసుకోలేని స్థితిలో దివారాత్రులు తల్లిదండ్రులు భార్యాపిల్లలను ఎక్కడో వదిలి మొబైల్ లో వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా లేక ఎవరూ లేని ఏకాకివై హెలీకాఫ్టర్ లో వచ్చే తన సహచరుల కోసం ఎదురుచూపులు,,,,,,,,,,,చలిగాలుల తీవ్రతకు ఒకోసారి ప్రాణాలమీదికి వచ్చే ప్రమాదంఉగ్రవాదులని తీవ్రవాదులని సైనికులనే టార్గెట్ గా క్షిపణులతో దాడులను ఎదుర్కొంటూ డేగ కళ్ళ మధ్య జీవితం ప్రమాదం పొంచివున్నా మొక్కవోని ధైర్యం గుండెల నిండా నీవే ఓ దేశానివి కత్తులబోనులో దేశ సరిహద్దు కాపలా ప్రాణాలకు తెగించి చేసే కవాతు,,,,,, వీరజవాన్ నీవు మా ప్రాణాలు కాపాడే దైవానివి నీవేలేకపోతే…
Read More