అమ్మాయే నవ్వితే

అమ్మాయే నవ్వితే

అమ్మాయే నవ్వితే

అమ్మాయే నవ్వితే
అబ్బాయే చూసాడంటే
ఆమె కొంప మునుగుతుంది
ప్రేమంటూ వెంట పడతాడు!

కల్లబొల్లి కబుర్లతో పడేస్తాడు
ఆ ప్రేమ కాస్త మెాజు తీరగానే
మెాసానికి దారి తీస్తుంది కొంత
కాలానికే వెగటు కలిగిస్తుంది!

పెద్దలను ఎదురించి
చేసుకున్న పెళ్లైనా సరే
విడిపోక తప్పదు మరి
ఆశలు కోరికలు అంతరిస్తాయి!

పెళ్లి పెటాకులవుతుంది
ఈ లోగా పిల్లలైతే మరీ
దారుణం పిల్లలు లేకపోతే
కొంతలో కొంత బెటరు!

ముల్లు అరిటాకు చందాన
మెాసపోయేది అమ్మాయే
కొంప మునిగేది అమ్మాయిదే
అందుకే అమ్మాయి నవ్వడం డేంజర్!

– ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *