aksharalipi

3275 Posts

కోగంటి విజయలక్ష్మి(రచయిత్రి)

కోగంటి విజయలక్ష్మి ప్రముఖ నవలా రచయిత్రి. ఈమె 1946లో జూలై 29న జన్మించారు. ఈమె తండ్రి మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కోగంటి రాజబాపయ్య, తల్లి శకుంతలాదేవి. 40 ఏళ్లకు పైగా సాహితీవ్యాసంగాన్ని కొనసాగించిన ఈమె ఎన్నో నవలలు రాశారు. ఈమె ఆయుర్వేద వైద్యురాలు. ఈమె వివాహం చేసుకోలేదు. ఈమె వ్రాసిన కథలు వసుధ, పుస్తకం, కోకిల, వనిత, ఆంధ్రజ్యోతి, అంతరంగాలు తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈమె తన 70వ యేట కృష్ణాజిల్లా గుడివాడలో 2016, మార్చి 10వ తేదీ గురువారం రాత్రి గుండెపోటుతో మరణించారు. రచనలుజ్వలిత నా కవితమన్నించు ప్రియా (కథల సంపుటి)చక్రతీర్థంచక్రవ్యూహంనిక్షిప్త. మాధవి కాళ్లసేకరణ
Read More

ఆర్.పి.పట్నాయక్(సంగీత దర్శకుడు, గాయకుడు,రచయిత , నటుడు, నిర్మాత)

ఆర్. పి. పట్నాయక్ గా పిలువబడే రవీంద్ర ప్రసాద్ పట్నాయక్ తెలుగు సినీ సంగీత దర్శకుడు, నటుడు, రచయిత, చిత్ర దర్శకుడు. మార్చి 10, 1972 న జన్మించాడు. ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారాలుఫిలింఫేఫ్ ఉత్తమ తెలుగు సంగీత దర్శకుడు - నువ్వు నేను (2001).ఫిలింఫేఫ్ ఉత్తమ తెలుగు సంగీత దర్శకుడు - సంతోషం (2002 సినిమా) (2002).ఫిలింఫేఫ్ ఉత్తమ కన్నడ సంగీత దర్శకుడు - ఎక్స్‌క్యూజ్ మీ (2003). నంది పురస్కారాలునంది ఉత్తమ సంగీత దర్శకుడు - నువ్వు నేను (2001).నంది ఉత్తమ కథా రచయిత - అందమైన మనసులో (2008).నంది ఉత్తమ కథా రచయిత - బ్రోకర్ (2010). సంగీత దర్శకుడునీకోసం (1999) (తొలి చిత్రం)చిత్రం (2000)శుభవేళ (2000)ఫ్యామిలీ సర్కస్ (2001)నువ్వు నేను (2001) నటుడుమనలో ఒకడు (2016)శీను వాసంతి లక్ష్మిబ్రోకర్తులసీదళం (2016). దర్శకుడుబ్రోకర్ఫ్రెండ్స్ బుక్తులసీదళం (2016)కాఫీ విత్ ఏ కిల్లర్ (2025)శ్రీను వసంతి లక్ష్మిఅందమైన మనసులో. మాధవి కాళ్లసేకరణ
Read More
ఉగాది పండుగ సందర్భంగా కవిత్వం.

ఉగాది పండుగ సందర్భంగా కవిత్వం.

ఉగాది పండుగ సందర్భంగా కవిత్వం ఉదయసూర్యుడు నవ్వుతూ వెలిగే వేళ,ప్రకృతి కొత్త వస్త్రాలు ధరించి మనసును హర్షింపజేస్తుంది.కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మేమంతా ఆనందిస్తాము.ఉగాది అంటేనే ఆరంభం. ఆనందాల పండుగే ఉగాది.ఇంటింటా మామిడి తోరణాలు కట్టేస్తాము.ముంగిట రంగురంగులదీపాలను వెలిగిస్తాము.కొత్త బట్టలు ధరించి అందరూ సంబరపడతారు.పెద్దలు ఆశీర్వాదాలు ఇస్తూ మమ్మల్ని దీవిస్తారు.ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు జీవిత పాఠాలను నేర్పుతాయి. ఉగాది పచ్చడి జీవితం యొక్క అర్థం చెబుతుంది.సంతోషం, బాధ రెండూ సమానమని గుర్తుచేస్తుంది.కాలం కొత్త పుటలు తెరిచేను.కొత్త కలలు మనసులోవెల్లివిరిసే రోజు ఉగాది.కోకిలమ్మ పాటలుఅందరికీ ఇష్టమే.చెట్లు కొత్త చిగురులతోఅందంగా కనిపిస్తాయి. భూమి పచ్చని చీర కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది.పల్లెల్లో పండుగ సందడి వెల్లివిరుస్తుంది.వీధులన్నీ ఆనందంతో కళకళలాడుతాయి.ప్రతి ఇంటిలో నవ్వులు వినిపిస్తాయి.కొత్త సంవత్సరం మంచి జరగాలని అందరూ కోరుకుంటారు.దేవాలయాల్లో ప్రార్థనలు జరుగుతాయి ‌ పంచాంగ శ్రవణం వినేందుకు ప్రజలంతా వస్తారు.భవిష్యత్తు శుభమై ఉండాలని ప్రార్థిస్తారు.స్నేహితులు, బంధువులు కలిసి పండుగ జరుపుకుంటారు. మన సంస్కృతి గొప్పతనం…
Read More
శ్రీ పరాభవ ఉదయం

శ్రీ పరాభవ ఉదయం

చైత్ర పాడ్యమి చిరునవ్వుతో వచ్చెనుశ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభమైనదిపరాభవమంటే ఓటమి కాదు, పాఠమే అని చాటెనులోపాలను గుర్తించి, అధిగమించే ఆత్మపరిశీలన బోధిస్తుంది వసంత రుతువు చిగుర్లు చిరాకులు చూపెనుమామిడి తోరణాలు ఊగెను ఇంటి గుమ్మాల మీదపచ్చడి షడ్రుచులు జీవిత సత్యం తెలియజేసెనుచేదు తీపి పులుపు కలిసి సమతుల్యత చూపెను బ్రహ్మ సృష్టి ఆది ఈ ఉగాది రోజునమత్స్యావతారం వేదాలు కాపాడిన దినమునూతన సంవత్సరం నూతన ఆశలు తెచ్చెనువినయంతో, సేవాభావంతో ముందుకు సాగమని చెప్పెను పరిపక్వత పెరిగి, ధార్మిక జీవనం పాటించాలిఆలోచనల్లో స్పష్టత, క్రమశిక్షణ కలిగి ఉండాలిఅవమానాలు భయపెట్టవు, పాఠాలుగా మార్చాలిపరాభవం పరాజయం కాదు, పరిణామం అని తెలియాలి కోయిల పాటలు, పూల పరిమళాలు ఆహ్లాదం పంచెనుపంచాంగ శ్రవణం చేసి శుభాకాంక్షలు చెప్పుకుందాంశ్రీ పరాభవ సంవత్సరం సుఖ సంతోషాలు తెచ్చిపెట్టాలిఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అందరికీ కలగాలి! జై ఉగాది! జై హింద్ ! 🚩🛕🇮🇳సాగిరాజు మురళీధర్ వర్మ ✍️✍️✍️
Read More
బతుకు పచ్చడి

బతుకు పచ్చడి

అక్షర ఉగాది పండుగ పోటీ కొరకు అంశం :⁠- ఉగాది పండుగ తేది:⁠- 09/03/2026 శీర్షిక:⁠- బతుకు పచ్చడి చైత్ర మాసపు తొలివేకువనప్రకృతి పులకించిందివేప పూత పరిమళాలతోవసంతం పలకరించిందిమామిడి తోరణాల అలంకారం లోగిలికి అందంఅభ్యంగన స్నానాలతోమొదలయ్యే పండుగ సంబరంషడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడితీపి, వొగరు, చేదుల కలయికే జీవితపు అలజడికష్టసుఖాల విలువను చాటే నిఖార్సైన పాఠంసమతుల్యతను నేర్పేమన సనాతన ఆచార మార్గంకొత్త బట్టల మురిపెంలో పిల్లల కేరింతలుపంచాంగ శ్రవణంలో పెద్దల భవిష్యత్తు ఆలోచనలుకవి సమ్మేళనాల వేదికపై అక్షరాల అల్లికలుతెలుగు సంస్కృతినిచాటే మనోహర వేడుకలుపాత చేదును మరచికొత్త ఆశలు చిగురించాలిపరాభవ నామ సంవత్సరం అందరికీ శుభాలు చేకూర్చాలిరాశి ఫలాల రాకతో మనసులో ధైర్యం నిండాలిప్రతి ఇంటా ఆనందపు సిరులు వెల్లివిరియాలిప్రకృతి ఒడిలో మనిషి చేసే నూతన ప్రయాణంసంప్రదాయాల సాక్షిగా సాగే అద్భుత పరిణామంతెలుగు వారి పండుగ.. లోకానికి ఒక దిశానిర్దేశంఉగాది అంటే కేవలం రోజు కాదు.. అది బతుకు సందేశం… మాధవి…
Read More
ఉరుములు మెరుపుల తుఫాను రాత్రి,,,,

ఉరుములు మెరుపుల తుఫాను రాత్రి,,,,

ఈ రేయి కునుకనేది కరువైదేనికోసమో పడిగాపులు గాస్తున్న జిజ్ఞాస,,,,,ఈ నిశీధిలో నా కళ్ళల్లోంచి నిప్పురవ్వలు ఎగిసిపడుతూ ఏదోతెలియని దేనికోసమో దేములాట,,,,,ఈ అగ్గిరాజుకుంటున్న గుండె ఉరుములు మెరుపుల తుఫాను గాలులకు సిద్ధమవుతోంది,,,,జీవన్మరణ పోరాట యుద్ధం మొదలిడేందుకు మనస్సు కుంపటి జ్వలిస్తోంది,,,,ఆఖరి పోరుకై ఆలోచనల తరంగాల శరపరంపర జగత్తు నిండా చొచ్చుకెళ్తున్నాయి,,,,గుమ్ముగా కమ్మగ ఈ ధరిత్రిపై నిస్సిగ్గుగా నిద్దరోతున్న జనం,,,,స్వేచ్ఛలేని ఒకరి అజమాయిషీ కింద పనిచేసే ఆలోచనలుడిగిన బానిసలు,,,,,సృజనలేని మనస్సు జఢపదార్ధంమనస్సుకు హృదయానికి సెగలు తగిలితేనే ఆలోచనల అలజడి,,,,,ఈ అంతులేని జీవిత పోరాటానికి ఆద్యంతములు లేవు,,,,,జీవితాలు రొటీన్ గా చాకిరీకి అలవాటు పడిన పెను వ్రణం,,,,వినూత్న అందాల జీవన సోయగాలను చవిచూడని అనాది నుండి గాయపడుతున్న జీవితాలు,,,,,,జీవితం ఆఖరి క్షణాల దాకా దేనికోసమో దేములాట,,,,ఈ మురికి కంపుగొట్టే జీవితాల వేదనలు మటుమాయ మయ్యేదెన్నడు !!??!!మనస్సు పొరలు కడిగిపారేసే సృజనాత్మక సాహితీ సంపర్కముతోనే ,,,,,,,,నీలో చైతన్యం రగిలి జీవనశైలి జ్యోతిర్మయమై అద్బుత ఆవిష్కణలు జరిగేది సృజనశీల…
Read More
మనస్సు మర్మం,,,,,,,,,,!!

మనస్సు మర్మం,,,,,,,,,,!!

నా మనసు విరితేనీయలభావాల తరంగాలునీ హృదయాన్ని తాకి జల్లుమనగాహరిచందన కుసుమం నీ మోమునింగిలోని చందమామ మత్తిలిమనస్సు మర్మం ఎరిగిన చందంకానుగ చెట్టుపై నిద్దరోతున్న గండుకోయిలరెప్పపాటున మేల్కొని రాగాలాపన చేస్తుంటే,,,,,,,!పూలు తమ రెక్కల తలలూపుతూనీ ముఖారవిందం అరవిరిసిన మందారంవెన్నెలలో కుసుమాల దరహాసాలువింత వింత మత్తిలు సుగంధాలుసెలయేటి నురగల అలలుసెడదీర్చు మౌన మందహాసాలుగోపాలుని వేణుగానంపరవశంతో పులకరించు మది!దోరగా పండిన మామిడి చెట్టుపై పండ్లునీ కర కమలాలతో కోస్తుంటేనా హృదయంలో తీయని బాధ!తెల్లని కుందేలు జాబిలి పూచే వెన్నెలలుమరుమల్లెల అందాలు గుప్పుమనగానడిరేయి నిద్దుర మరచిన మనస్సువేయి పడగల కింద హాయిగా నిద్దరోతున్న హరిశోభిల్లు హృదయాలు సేదదీరెందుకుపక్రమించగాకొండలపై నర్తించే మయూరాలుఆకాశంలో మిణుకు మిణుకు మని మెరిసే నక్షత్రాలుఒకటొకటిగా జారి భువిపై పడుతున్న చందంమనస్సు పూవై వికసించి దిండుని హత్తుకుని నిద్దరోయింది!! అపరాజిత్సూర్యాపేట
Read More
కార్యసాధన బాల

కార్యసాధన బాల

ఎదుట కనిపించిన దృశ్యాన్నిఆమూలాగ్రం జయించడానికి సమాయత్తమైఆమె..తలదించుకుంటుంది, ఘటనలో ఆమె సిగ్గుపడుతోందని మనం భ్రమిస్తాం……..!మలిచూపు చాలా చురుకైనదిసర్వమూ గ్రహించేస్తుంది…..అప్పుడిక నీ……. తత్వ,మనస్తత్వ,చరిత్రగ్రంథంనీ ముందు సమర్పిస్తుంది…..ఆశ్చర్యపోవడం మనవంతు….చూపుల స్కానింగ్ కెమరా…..నీలో లోలో సర్వాన్ని ఆకలించుకుంటుంది…….!,కనురెప్పలు వాల్చడం అంటే సిగ్గుపడడం కాదు…….నీ అమాయకత్వ భావన సరికాదు……………………………..స్కానింగ్ ను హృదయానికి అందించడంఅన్నమాట…..!.ఇది ఉన్నమాటే…..!!నెరజాణ ఆమె…..మనం అనుకున్నంత బేల కాదు……!కార్యసాధన బాల….!🩷🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి,9490125878
Read More
హీరాకణి బురుజు

హీరాకణి బురుజు

స్త్రీ శక్తి కోటలను సైతం మించిపోతుంది, తల్లి మమకారం అగాధాలను కూడా గెలుస్తుంది….. అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసిన ఒక తల్లి కథ ఇది. తల్లికి తన బిడ్డపై ఉండే మమకారం మరియు ధైర్యాన్ని చాటి చెప్పే ఒక నిజమైన సంఘటన.ఇది మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజు పరిపాలనా కాలంలో జరిగిన కథ. శివాజీ నిర్మించిన రాయ్‌గడ్ కోట సామాన్యమైన కోట కాదు. కొండలు, గుట్టలు, నదులు, వాగులు అన్నీ ఆ కోట లోపలే ఉండేవి. కోట పైభాగంలో రాజప్రసాదం, అధికారులు మరియు వారి కుటుంబాలు నివసించేవారు. కోట దిగువన ఉన్న గ్రామాల్లో చాలా కుటుంబాలు నివసించేవి. పొలం, పశువులు, మేకలు వంటివాటిని సాకుతూ ఎన్నో కుటుంబాలు అక్కడ ఉండేవి. దిగువ కోటలో ఉండేవారు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పండ్లు, కూరగాయలను బుట్టల్లో మోస్తూ పై కోటకు వెళ్లి అమ్ముకుని వచ్చేవారు.కోటలో ఏడాదికోసారి జాతర జరిగేది. ఆ రోజు పౌర్ణమి…
Read More
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగాఉ!!మా!!💐💐💐💐

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగాఉ!!మా!!💐💐💐💐

మాతను గౌరవించవలె మానక సేవలొనర్చుచుండి యామాతకు పూజజేయవలె మంత్రయుతంబుగ విద్య నేర్పగన్మాతను జీవితాంతమును మానసమందున నిల్పువారికిన్మాత దయాసముద్ర శుభమంగళదాయిని మానవాళికిన్!! గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట
Read More