Blog

Your blog category

నా గీతం

నా గీతం

నా గీతం,,,,,,! చ !! ఏదో ఒక భావం మెదిలిందీవేళవిషాద లతలేవో కళ్ళల్లో మెదిలే వేళ!!ఏదో ఒక భావం !! చ !! మదినిండా మసక చీకట్లు కమ్ముకున్న వేళదివిలో తారకల వెలుగులో నా పయనమెటోఅమావాస్య చంద్రుని చీకట్లు అలుముకున్న వేళఈ దుఃఖితుణ్ణి ఓదార్చే వారెవరూ లేని ఈ వేళ!!ఏదో ఒక భావం !!చ !! చెలిమికి లేని చెలియ మది పలికే విషాద గీతంబాధాతప్త గుండెల్లో పడిలేచే కడలి తరంగాల మది గారడీదుఃఖ సంద్రంలో చుక్కాని లేని నావ తీరం చేరేనామంద్రమైన మనసు విషాద భావాలు విప్పుతున్న వేళ!!ఏదో ఒక భావం !!చ !! జీరబోయిన కళ్ళల్లో మెదిలే ఆశాదీపంఈ రేయి ముసురు చినుకుల్లో ముడుచుకున్న హృదయంచెలియ కౌగిలి మరులలో మైమరచిన దుఃఖిత హృదయం మదిలోచెలియ చెంతలో కన్నీళ్లు కరిగి సేదదీరిన శరీరం జ్ఞాపకం ఓ కలలో!!ఏదో ఒక భావం !! అపరాజిత్సూర్యాపేటఈ కవిత నా కలం సేత అని…
Read More
కాశీ యాత్ర (ఏడవ రోజు )

కాశీ యాత్ర (ఏడవ రోజు )

తేది 26-2-2025 బుధవారం . ఈ రోజు అయోధ్యకు వెళ్ళాలని అనుకున్నాము కానీ శివరాత్రి రోజు శివుని సన్నిధిలో లేకుండా అయోధ్యకు ఎందుకు? అని ఉదయమే బసలోనే వేడినీళ్ళ స్నానాలు చేశాము.కొందరు గంగా స్నానము చేశారు.అందరం విశ్వనాథుని దర్శనానికి రెండవ ద్వారము నుండి వెళ్ళితే సులభంగా కలుగుతుంది అని తెలిసి అటుగా వెళ్ళాము.అక్కడ కొందరు పూజారులు వారి ఐడెంటిటీ కార్డులు చూపిస్తూ , " మీరు తలా 2 ,3 వందలు ఇస్తే అరగంటలోనే మీకు దర్శనం చేయిస్తాము " అన్నారు.మేము 10 మందిమి కలిసి డబ్బులు ఇవ్వకుండా వరుసలో నిలబడినాము.కొందరు ఏవేవో కారణాలు చెబుతూ మధ్య మధ్య లైనులో చేరుతున్నారు.అలాంటివి జరుగుతూనే ఉన్నాయి.మనం ఓర్పుతో ఉందామని " హరహర మహాదేవ శంభో శంకర "అనుకుంటూ ముందుకు నడిచాము.కాలభైరవుని దర్శనము కంటే విశ్వనాథుని దర్శనము సులభంగానే కలిగినది.పక్కనే అన్నపూర్ణాదేవి అమ్మవారిని మరింత అనాయాసంగా దర్శించి ధన్యులమయ్యామని సంతోషంతో బసకు చేరుకున్నాము.🕉️🙏🕉️ -కోట…
Read More
తే!!గీ!!💐💐💐

తే!!గీ!!💐💐💐

నేతిబీరాలు బల్కుచు నిర్మలముగఛాతి విరుచుకు తిరుగుచు శక్తికొలది!పూతికాహారులట్లుంద్రు పుడమిలోనతెలుసుకోవయ్య కృష్ణయ్య తెలివితోడ!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More
ద్వాదశి నాగేశ్వరశాస్త్రి(తెలుగు పండితుడు, అధ్యాపకుడు, రచయిత, విమర్శకుడు)

ద్వాదశి నాగేశ్వరశాస్త్రి(తెలుగు పండితుడు, అధ్యాపకుడు, రచయిత, విమర్శకుడు)

ద్వాదశి నాగేశ్వరశాస్త్రి తెలుగు పండితుడు, అధ్యాపకుడు, రచయిత. ద్వానాశాస్త్రి గా ఆయన పేరుపొందాడు. ఇతడు కృష్ణాజిల్లా లింగాలలో 1948 జూన్ 15వ తేదీన జన్మించాడు తల్లి లక్ష్మీప్రసన్న. తండ్రి కృష్ణశాస్త్రి. ఏలూరు సర్. సి.ఆర్. రెడ్డి కాలేజిలో బి.ఎస్.సి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ (తెలుగు) చదివాడు. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్, తెలుగు విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశాడు. ఇతని గురువులలో ప్రముఖులు తూమాటి దోణప్ప, చేకూరి రామారావు, బండ్లమూడి సత్యనారాయణ, కొత్తపల్లి వీరభద్రరావు. విశ్వవిద్యాలయంలో మారేపల్లి రామచంద్ర శాస్త్రి (శ్రీ శ్రీ కి, ఆరుద్రకు ఛందస్సు నేర్పిన గురువు) కవిత్వం మీద ఎం. ఫిల్. సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించాడు. సాహిత్యసంస్థలపై చేసిన పరిశోధనకి గుర్తింపుగా తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను స్వర్ణ పతకముతో పాటు పి.హెచ్.డి.తో సత్కరించింది. అటు పిమ్మట ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశాడు. 1972 నుండి 2004…
Read More
విక్టర్ హ్యూగో(ఫ్రెంచి నవలా రచయిత, కవి, నాటక రచయిత, వ్యాస కర్త)

విక్టర్ హ్యూగో(ఫ్రెంచి నవలా రచయిత, కవి, నాటక రచయిత, వ్యాస కర్త)

విక్టర్-మేరీ హ్యూగో, వికామ్టే హ్యూగో (26 ఫిబ్రవరి 1802 – 22 మే 1885) ఒక ఫ్రెంచ్రొమాంటిక్రచయిత, కవి, వ్యాసకర్త, నాటక రచయిత, పాత్రికేయుడు, మానవ హక్కుల కార్యకర్త మరియు రాజకీయవేత్త. అతని అత్యంత ప్రసిద్ధ రచనలు ది హంచ్‌బ్యాక్ ఆఫ్ నోట్రే-డేమ్ (1831) మరియు లెస్ మిజరబుల్స్ (1862). ఫ్రాన్స్‌లో, హ్యూగో లెస్ కాంటెంప్లేషన్స్ మరియు లా లెజెండే డెస్ సీకిల్స్ ( ది లెజెండ్ ఆఫ్ ది ఏజెస్ ) వంటి కవితా సంకలనాలకు ప్రసిద్ధి చెందాడు. హ్యూగో తన నాటకం క్రోమ్‌వెల్ మరియు నాటకం హెర్నానితో రొమాంటిక్ సాహిత్య ఉద్యమంలో ముందంజలో ఉన్నాడు . అతని రచనలు అతని జీవితకాలంలో మరియు అతని మరణం తరువాత సంగీతాన్ని ప్రేరేపించాయి, వీటిలో ఒపెరా రిగోలెట్టో మరియు సంగీత నాటకాలు లెస్ మిజరబుల్స్ మరియు నోట్రే-డేమ్ డి పారిస్ ఉన్నాయి. అతను తన జీవితకాలంలో 4,000 కంటే ఎక్కువ చిత్రాలను…
Read More
సాలోచనల కెరటాలు,,,,,!

సాలోచనల కెరటాలు,,,,,!

కారుచీకట్ల దుఃఖసంద్రంలో కొట్టుమిట్టాడిన వెర్రి బికారి నేను నాడుమనస్సు దుర్గతుల ఆలోచనలు పీకి కాలం కడలి ఆనంతంలోకి విసిరేశాను,,,,నరనరాల్లో ఇమిడిపోయిన రక్తసిక్త అక్షరాల సత్యం కళేబరాన్ని వేగించి నీకు ఆహారంగా వేస్తున్నాను,,,,,కళ్ళల్లో కదలిపోతున్న దుర్గతుల దృశ్యాలు కాలం నిప్పుల సెగలో రాలిపోయాయి,,,,,కాలం ఆవలి నుండి మోసుకొచ్చిన ఈ శరీరం క్షణంలో మంటల్లో దగ్దమయ్యేను,,,,నేననే కుళ్ళి కంపుగొట్టే సమాజం అగ్గిపిడుగుల సత్యం జ్వాలల్లో అనంత కాలగర్భంలో అంతర్థానమయ్యేను,,,,,అశ్లీల మనస్కుల గొంతులు నులిమి పెంట మనస్సును పీకి చేతిలో పెడితే ఆ గబ్బువాసన గుండెల్లో గుచ్చుకుని పరివర్తన చెందును,,,,,,చెడు ఆలోచనల అగ్నిధారలు పెట్రేగే కుట్రలు, కుతంత్రాలు ,దుర్గంధాలను పాతాళం మనస్సు పెరట్లో గుమ్మరిస్తేనే సత్యాసత్యాల వివేచన తెలిసివచ్చును,,,,ప్రవర్తనల ఆలోచనల చుట్టూరా పరిమళాల పూవుల వ్యక్తిత్వం విరబూయాలి,,,,,చెడుతలంపులు అంతర్థానమై నీవు నీవే అంటూ ఆకాశం గర్జించాలి,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
ఉండాలోయ్! మనమంతా

ఉండాలోయ్! మనమంతా

మల్లెతీగకు పందిరిలాపూలదండకు దారంలాఉండాలోయ్! పేదోళ్లకుఆశ్రయాన్ని కోరినోళ్లకు వెలుగు పంచే దీపంలాప్రాణం నిలిపే తరువులాఉండాలోయ్! లోకంలోతొలి స్థానము అన్నిటిలో కడువు నింపే రైతులాసరిహద్దు సైనికునిలాఉండాలోయ్! తెగువతోమదినిండా ధైర్యంతో ఉదయించే సూర్యునిలాసుతిమెత్తని వెన్నెల్లాఉండాలోయ్! మాటలాగుబాళించే తోటలాఇట్లుమీకోటేశ్వరరావు ఉప్పాల
Read More
కాశీ యాత్ర ( ఆరవ రోజు )

కాశీ యాత్ర ( ఆరవ రోజు )

తేది 25-2-2025 మంగళవారంఉదయం 5 గం.లకు లేచి స్నానాలు చేసి అందరం కాలభైరవుని దర్శనానికి వెళ్ళాము.అక్కడి క్యూ వరసలు చూసి మనం ఇంత బారులో నిలబడలేమనీ ,మధ్యలో దూరితే లైనులో ఉన్నవారు గోలచేస్తూ వెనక్కి పంపిస్తున్నారు.తప్పని పరిస్థితిలో ఓపిక ఉన్న వారంతా వెనక్కు వెళ్ళి వరుసలో వెళ్ళి నిలబడ్డారు. నలుగురం మాత్రము అక్కడే కూర్చున్నాం.మనవాళ్ళు వచ్చినపుడు లేచి వరుసలో కలిశాము. కొద్దిదూరం వెళ్ళినాక గడకర్రలతో సన్నని దారి ఏర్పాటు చేశారు. అందులో బయటివారు దూరే అవకాశం లేదు కాని ఆ ఇరుకు సందుల్లో అటు ఇటు ఉన్న దుకాణాల్లో వస్తువులు కొనేవారిలాగ తిరుగుతూ లైనులో దూరుతున్నారు.పోలీసువారు భక్తులవద్ద డబ్బులు తీసుకుని వారిని లైనులో కలుపుతున్నారు.అదేమిటని అడిగితే " వారు లైనులో ఉన్నవారే " అని పోలీసులు చెబుతున్నారు.ఒకమూలమలుపులో కాళ్ళు కడుక్కోవడానికి పంపు ఏర్పాటు చేసినారు.భక్తులంతా అక్కడ కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి వెళ్ళడమేనని ,గుడి దగ్గరికి వచ్చామని అనుకున్నాము. ఇదిగో అదిగో అంటూ…
Read More
ఆచ్చి వేణుగోపాలాచార్యులు(సినీ గీత రచయిత)

ఆచ్చి వేణుగోపాలాచార్యులు(సినీ గీత రచయిత)

ఆచ్చి వేణుగోపాలాచార్యులు (1930-2016) ప్రముఖ సినీ గీత రచయిత. తెలుగు సినిమారంగంలో ఎన్టీఆర్ సలహామేరకు వేణుగోపాల్ గా మార్చుకున్నారు. ఇతడు హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్‌లో 1930, జూన్ 12వ తేదీన జన్మించాడు. తెలుగుతో పాటు ఉర్దూ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రవీణుడైన వేణుగోపాలాచార్యులు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ప్రవృత్తిరీత్యా రచయిత. ఈయనకు భార్య కమలాదేవి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పట్నంలో శాలిబండ, పదవే పోదాము గౌరీ, జయజయజయ శ్రీ వేంకటేశ, నమో వేంకటేశ.. నమో తిరుమలేశా తదితరపాటల ద్వారా వేణుగోపాలాచార్యులు తెలుగువారికి సుపరిచితుడు. సంధ్యాదీపం, పచ్చని సంసారం, భాగ్యవంతుడు, అమరుడు తదితర మంచి చిత్రాల్లో పాటలను రాసి ఎంతో కీర్తి గడించారు వేణుగోపాలాచార్యులు. ఆయన రాసిన పాటలన్నీ తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగుతో పాటు హిందీ చిత్రం నాసిక్‌లో కూడా ఆయన పాటలు వ్రాశాడు. సినిమా పాటల జాబితా..అమూల్య కానుక ఏల మరచావో ఈశా నన్నేల మరచావో ఈశా…
Read More
ఏల్చూరి సుబ్రహ్మణ్యం(కవి, రచయిత, పాత్రికేయుడు)

ఏల్చూరి సుబ్రహ్మణ్యం(కవి, రచయిత, పాత్రికేయుడు)

ఏల్చూరి సుబ్రహ్మణ్యం ( జ:ఆగష్టు 26, 1920 - మ:ఫిబ్రవరి 25, 1995) ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు. ఆయన తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత వహించిన అభ్యుదయ కవిత్వోద్యమానికి ఆద్యుల్లో ఒకరు. నయాగరా కవులుగా ప్రసిద్ధి పొందిన ముగ్గురిలో ఒకరు. నయాగరాకవులలో ఒకరుగా ప్రసిద్ధులయిన ఏల్చూరి సుబ్రహ్మణ్యం జననం ఆగష్టు 25, 1920. తండ్రి రామయ్య. తల్లి సుబ్బాయమ్మ. ప్రముఖ వేణుగాన కళావిద్వాంసులు ఏల్చూరి విజయరాఘవరావు వీరి సోదరులు. ఏల్చూరి మురళీధరరావు వీరి కుమారుడు. సహజకవిగా, మహావక్తగా, ఉద్యమప్రవక్తగా, అజాతశత్రువుగా, అఖిలాంధ్ర కవిలోకానికి ఆత్మీయ మిత్రునిగా మెలగారు. మద్దులపల్లి గురుబ్రహ్మశర్మ, భాగవతుల వెంకట సుబ్బారావు, అక్కిరాజు రామాపతిరావు, నాయని సుబ్బారావులు చిన్ననాటి గురువులు. బి.ఎ. చదువుతున్న రోజులలో కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసులతో పరిచయమై, తరువాతికాలంలో “నయాగరా” కవితాసంకలనం సమకూర్చడానికి దోహదమయింది. బి.ఎ. డిగ్రీ (యస్.ఆర్.ఆర్ కళాశాల), విజయవాడ. సుబ్రహ్మణ్యం గారు నయాగరా కవిత్రయంలో ఒకరు. మిగిలిన ఇద్దర్లో ఒకరు బెల్లంకొండ…
Read More