Blog

Your blog category

ప్రపంచ గృహవసతి దినోత్సవం

ప్రపంచ గృహవసతి దినోత్సవం

ప్రపంచ గృహవసతి దినోత్సవాన్ని (ప్రపంచ నివాస దినోత్సవం) ప్రతి సంవత్సరం అక్టోబర్ మొదటి సోమవారం నాడు జరుపుకుంటారు. ఈ రోజున మానవ నివాసాల పరిస్థితి, అందరికీ తగినంత ఆశ్రయం పొందే ప్రాథమిక హక్కుపై దృష్టి సారిస్తారు. ప్రజలకు తగినంత నివాసం ఉండే ప్రాథమిక హక్కును గుర్తుచేయడం.ప్రజలకు భవిష్యత్ తరాల ఆవాసాల కోసం బాధ్యత వహించాలని చెప్పడం.పట్టణాలు, నగరాల భవిష్యత్తును రూపొందించే శక్తి, బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని గుర్తుచేయడం. ప్రపంచ నివాస దినోత్సవాన్ని మొట్టమొదట 1986లో కెన్యాలోని నైరోబిలో "ఆశ్రయం నా హక్కు" అనే థీమ్‌తో జరుపుకున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ దీనిని వార్షిక కార్యక్రమంగా నిర్వహించాలని నిర్ణయించింది మరియు అక్టోబర్ మొదటి సోమవారం ఎంపిక చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు మరియు వేగవంతమైన పట్టణీకరణ సమస్యలు మరియు పర్యావరణం మరియు మానవ పేదరికంపై దాని ప్రభావాన్ని పరిశీలించడానికి వివిధ కార్యకలాపాలు నిర్వహించబడతాయి. ప్రపంచ నివాస దినోత్సవం…
Read More
అక్టోబర్ 06 ప్రత్యేకతలు :⁠-

అక్టోబర్ 06 ప్రత్యేకతలు :⁠-

1860: ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షాస్మృతి చట్టమైన రోజు. 1927: ది జాజ్ సింగర్ అనే తొలి టాకీ సినిమా (శబ్ద చిత్రం) ని వార్నర్ బ్రదర్స్ (అమెరికా) లో విడుదల చేసారు. ఒకటి, రెండు పాటలు, కొన్ని మాటలు మాత్రమే ఉన్నాయి. 1963: హైదరాబాదులో నెహ్రూ జంతుప్రదర్శనశాల ప్రారంభించబడింది. 1896: కనుపర్తి వరలక్ష్మమ్మ, తెలుగు రచయిత్రి. (మ.1978). 1908: ఈశ్వరప్రభు, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1932 : గణేశన్ వెంకటరామన్, భారతీయ భౌతికశాస్త్రవేత్త, రచయిత, శ్రీ సత్యనాయి విశ్వవిద్యాలయానికి పూర్వపు వైస్ ఛాన్సలర్. 1933: ముకర్రం జా, నిజాం వారసుడు (మ. 2023). 1942: బి.ఎల్.ఎస్.ప్రకాశరావు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన గణాంకశాస్త్రజ్ఞుడు, ఆచార్యుడు. 1943: రాజా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు. 1946: వినోద్ ఖన్నా, బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. (మ.2017). 1958: పనబాక లక్ష్మి, భారత పార్లమెంటు సభ్యురాలు. 1892:…
Read More
అవనిపై జీవంపోసే సూరీడా రా తరలిరా,,,,,!!

అవనిపై జీవంపోసే సూరీడా రా తరలిరా,,,,,!!

నీలినీలి నింగి నిండా ప్రభాత పరంజ్యోతి దివ్యకాంతుల తేజస్సుతో భువిపై పసిడి ,ఎర్రచందనం సమ్మిళిత కాంతులు విరజిమ్ముతున్నాడు,,,,,,,,,కొండలు, రహదారులనునులివెచ్చని ఊదా వన్నె కిరణాలు స్పృశించగానే భువిపై సూర్యప్రభలతో శునిషిత సౌందర్యం పరచుకొంటున్నాడు సుప్రభాత సూరీడు,,,,,,,,జీవకోటిని ప్రాణప్రదం చేస్తూ మానవ జీవన స్రవంతులకు సప్తవన్నెల సమ్మిళిత కిరణాలు మౌనవీణపై సప్తస్వరాలతో మేల్కొలుపు గీతాలు ఆలపిస్తూ,,,,,,,,,,,,,అవనిపై జీవజాలములు ,వృక్షజాలములు జీవం ఉత్తేజమయి వెచ్చవెచ్చని కాంతులలో జీవనతంత్రులు మీటును ,,,,,,,,పచ్చపచ్చని పైరులు శశ్యశ్యామలములవును భానుడి వాడి కిరణాల తాకిడికి ఉపిరిపోసుకుని దన్యమవును .ప్రతినిత్యం నెమ్మది నెమ్మదిగా పంటల సిరులతో అలరారును, రైతుల శ్రమలు సాఫల్యమవును,,,,,,,,,,తెలతెల వారగానే గుండె లయలలో మనస్సు, శరీరం బడలికను వీడి నులివెచ్చని కిరణాలలో నవజీవన గారడీల లోకంలో శ్రామికులు, కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు సమస్తం పరుగుల జీవితాలలో రోజువారి పనులను మొదలిడి శ్రమల చిత్రాలను సృజియించే కళానేర్పరులు,,,,,,,,సంపన్నులు కారులలో, ఇతరత్రా వాహనాలలో పయనిస్తూ తమ వృత్తులలో, ఉద్యోగాలలో బిజీబిజీగా బ్రతుకులు,కొందరు…
Read More
అక్షరలిపి కొరకునేటి అంశం – సమాజంలో జరుగుతున్న అకృత్యాలువాటి పరిష్కారాలు..రచన – ఉమాదేవి ఎర్రం.

అక్షరలిపి కొరకునేటి అంశం – సమాజంలో జరుగుతున్న అకృత్యాలువాటి పరిష్కారాలు..రచన – ఉమాదేవి ఎర్రం.

శీర్షిక - ప్రకృతి ప్రకృతి సహజంగాప్రసాదించిన వరాలనుమనిషులంతా అకృత్యాలుగామారుస్తున్నారు.. పంచ భూతాలలో ఏ కల్మషమూలేదు , గాలిలో నీటిలో ఏ తేడాలేదు కానీ మనిషి నేర్చిన విధ్యలవల్ల కల్మషాలు మెుదలయ్యాయి.. ప్రకృతిలో ఏ లోపాలు లేక పోయినాఅధిక జనాభ చేరి కాలుష్యాన్నికలిగిస్తున్నాయి వాటి ప్రభావం వల్లతిరిగి మనుషులే బాధలు పడుతున్నారు.. ఇలా ఇవొక్కటే కాకుండా కొంతమందిరాక్షసుల్లా ప్రవర్తించి విచ్చల విడిగాఅన్యాయాక్రమాలు చేస్తున్నారు దొంగతనాలు, మానభంగాలు ఇలాంటివి.. వీటన్నీటిని పైనున్న దేవుడుచూస్తుంటాడని తెలుసుకోండివినాశకాలానికి విపరీత బుద్దులనుమానేసి పరిష్కారం వెతుక్కోండిమానవులారా!! ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా
Read More
ఆ.వె!!💐💐💐💐💐

ఆ.వె!!💐💐💐💐💐

అవసరములు దీర్చు నాత్మీయ బంధాలుకష్టములను దీర్చు కాసులేదు!అవసరమ్ములేని ఆయుష్షు నాకేలమరణమొసగు కృష్ణ మరవబోక!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More
ఉపాధ్యాయులు దిశానిర్దేశకులు

ఉపాధ్యాయులు దిశానిర్దేశకులు

సామాజిక కట్టుబాట్లు, విలువలను ప్రబోధిస్తూ దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ జీవన వైవిధ్యానికి మూలం ఉపాధ్యాయులు. తన గుండెల్లో తన కుటుంబ సమస్యల అగ్నిపర్వతాలు రగులుతున్నా విద్యార్థులతో చిరునవ్వులు చిందిస్తూ అద్భుత దిక్సూచిగా నిరంతరం చైతన్యస్వరూలు ఉపాధ్యాయులు.నేడు మారుతున్న సమాజంలో విద్యార్థుల వెకిలిచేష్టలు భరిస్తూ విజ్ఞానం విలువలు ,మన ముందున్న బాధ్యతలు కళ్ళకు కట్టినట్లు బోధిస్తారు. అనుసరణీయం ఆ ప్రభోదాలు, అయినా సినిమాలలోలా దుష్చేష్టలు తరగతిగది పవిత్రతను దెబ్బతీస్తే, దారిమళ్ళించి సన్మార్గంలో దిశానిర్దేశంచేస్తూ చైతన్య స్రవంతులు విద్యార్థులలో సృజియిస్తూ ,తన భోదనలతో జ్ఞానోపదేశం చేసేది ఉపాధ్యాయులు.ఉండవచ్చుగాక దుర్మార్గపు జీవనశైలితో ప్రవర్తనా లోపాలు వున్న ఉపాధ్యాయులు. అందుకని విద్యావ్యవస్థనే తపుపట్టటం శోచనీయం, ప్రమాదం.అపరాజిత్సూర్యాపేట
Read More
జరుగుతున్న అకృత్యాలు ,వాటి పరిష్కారాలు ఈ అంశం పై మీ రచనలు పంపగలరు..5/10/2025] అపరాజిత్ సూర్యాపేట  ఎగిరిపో ఓ పక్షి,,,,,,,!

జరుగుతున్న అకృత్యాలు ,వాటి పరిష్కారాలు ఈ అంశం పై మీ రచనలు పంపగలరు..5/10/2025] అపరాజిత్ సూర్యాపేట ఎగిరిపో ఓ పక్షి,,,,,,,!

గూడు చెదిరే గుండె పగిలేఎగిరిపో ఓ పక్షీ,,,,,,,!వికృతటాట్టహాసాల మనుష్యుల జీవన సరళిలో మనలేక,,,,,,,,ఎగిరిపో ఓ పక్షీ,,,,,,,!కంటి నిండా నిద్దుర కరువైనీ చిన్ని గుండె గుబగుబలాడుతూదరిత్రి నిండా విషవాయువుల పెనుభూతాలు భయం గొల్పుతూ,,,,,,కారడవులు నిట్టనిలువుగా కూల్చిన నరలోకంలో ఇమడలేక కన్నీరు మున్నీరవుతూ,,,,,,,,ఎగిరిపో ఓ పక్షీ,,,,,,,!గబ్బిలాలను కూడా వదలకుండా భక్షించే నరరూప రాక్షసుల మధ్య జీవించలేవు విహంగమా,,,,,,,,ఎగిరిపో ఓ పక్షీ,,,,,,,!తమను కన్న తల్లిదండ్రులనే హతమార్చే కిరాతకులు నరులు,,,,,,ఎగిరిపో ఓ పక్షీ,,,,,,,!ఆకలి దప్పికలు మరచి ఎన్నాళ్ళయిందో ఈ కారుచీకట్ల గోడల మధ్య గోప్యత లేని విశృంఖల జీవులలో ఇమడలేవు తల్లీ,,,,,,,,,ఎగిరిపో ఓ పక్షీ,,,,,,,,!చెరబడుతున్న ఆడపిల్లల ఆర్తనాదాల హింసా ప్రవృత్తుల గగ్గోలులు ప్రతినిత్యం నీకు ఇక్కడ స్వేచ్ఛ కల్పించే వాడేడి,,,,,,,,ఎగిరిపో ఓ పక్షీ,,,,,,,!సుభిక్ష భారతంలో ఆకలికి అల్లల్లాడుతున్న అనాధ లెందరో,,,వల్లమ్ముకుంటూ పూట గడుపుతున్న నిర్భాగ్యుల గోస చూడతరమా,,,,,,,,,,,ఇది చీకటి ముసురుకున్న రాజ్యం అజ్ఞాతంలో మానవతావాదులు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వని బ్రతుకు వేట జనులు,,,,,,,,ఎగిరిపో ఓ పక్షీ,,,,,,,,,!ఏ సుందర…
Read More
అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలతో….ఆటవెలదులు*గురువు మాటపైన గురినిల్పు శిష్యుడుఅన్ని శాస్త్రములను అభ్యసించుగురువు మాటలు వినగోరని శిష్యుడుపనికి రాక మిగుల పతనమగును!

అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలతో….ఆటవెలదులు*గురువు మాటపైన గురినిల్పు శిష్యుడుఅన్ని శాస్త్రములను అభ్యసించుగురువు మాటలు వినగోరని శిష్యుడుపనికి రాక మిగుల పతనమగును!

గురువు మాటమీద గురినిల్ప కున్ననూతల్లిదండ్రి మాట దాటుతున్నపెద్ధవారి మాట పెడచెవి బెట్టినానిరుపయోగమగును నిండు భవిత! వినయమున్నవాడు విద్యలార్జించునులక్ష్య పెట్టకున్న లక్ష్మి రాదువిద్య , లక్ష్మి వున్న విశ్వమంతా కీర్తివచ్చితీరు,జనము మెచ్చి తీరు ! .......... కోట.
Read More
అంతర్జాతీయ వ్యభిచార వ్యతిరేక దినోత్సవం సందర్భంగా….ఆ.వె.మగువల మగవాడు మానభంగము జేసిపసిడి జీవితాలు పాడు జేసిక్షణిక సుఖము కొరకు క్షోభపెట్టు స్త్రీలమగమృగాల కెపుడు మరణ శిక్ష ?

అంతర్జాతీయ వ్యభిచార వ్యతిరేక దినోత్సవం సందర్భంగా….ఆ.వె.మగువల మగవాడు మానభంగము జేసిపసిడి జీవితాలు పాడు జేసిక్షణిక సుఖము కొరకు క్షోభపెట్టు స్త్రీలమగమృగాల కెపుడు మరణ శిక్ష ?

.......... కోట.
Read More
అంతర్జాతీయ వ్యభిచార వ్యతిరేక దినోత్సవం

అంతర్జాతీయ వ్యభిచార వ్యతిరేక దినోత్సవం

అంతర్జాతీయ వ్యభిచార వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. వ్యభిచారం యొక్క ప్రభావం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం ఏర్పాటుచేబడింది. దీనిని తొలిసారిగా 2002లో ప్రారంభించారు. ప్రారంభ సంవత్సరంలో కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో, యునైటెడ్ స్టేట్స్, మెల్బోర్న్, విక్టోరియా, ఆస్ట్రేలియా దేశాలలో జరిగింది. 2005లో ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ విశ్వవిద్యాలయం, ఆసియా-పసిఫిక్ ఛాప్టర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వ్యభిచార వ్యతిరేక దినోత్సవంపై ఒక కార్యక్రమాన్ని నిర్వహించబడింది. దీనిలో యాంటీ-ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ చట్టం-2003 గురించి చర్చించారు.2008లో ఆరిజోనాలోని ఫీనిక్స్ నగరంలో ఈ దినోత్సవంనాడు క్యాండిల్ లైట్ల కార్యక్రమం ఉంది.2010లో జరిగిన కార్యక్రమంలో నగర నాయకులు, మాజీ వేశ్యలు పాల్గొన్నారు. భారతదేశంలో వ్యభిచారం చట్టబద్ధమైనది.కోరడం, క్రాల్ చేయడం అరికట్టడం, వ్యభిచార గృహాన్ని సొంతం చేసుకోవడం లేదా నిర్వహించడం, హోటల్‌లో వ్యభిచారం, పిల్లల వ్యభిచారం, పింపింగ్ మరియు పాండరింగ్ వంటి అనేక సంబంధిత కార్యకలాపాలు…
Read More