ప్రపంచ అంతరిక్ష వారం ప్రతి సంవత్సరం అక్టోబరు 4వ తేదీ నుండి అక్టోబరు 10వ తేదీ వరకు వారంరోజులపాటు నిర్వహించబడుతుంది. మానవ ప్రగతిని మెరుగుపడటానికి కారణమవుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీకి గుర్తుగా యూరప్, ఆసియాతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఈ దినోత్సవం జరుపబడుతుంది. 1957, అక్టోబరు 4న స్పుట్నిక్ 1అనే తొలి మానవ నిర్మిత ఉపగ్రహాన్ని ప్రారంభించి అంతరిక్ష అన్వేషణకు శ్రీకారం చుట్టగా, 1967 అక్టోబరు 10న చంద్రునితోసహా ఇతర ఖగోళ ప్రాంతాలలో అన్వేషణ వివిధ దేశాల కార్యకలాపాల నిబంధనలపై సంతకం చేయబడింది. అక్టోబరు 4, అక్టోబరు 10 తేదీలు ప్రపంచ అంతరిక్ష చరిత్రలో చారిత్రక సంఘటనలకు గుర్తుగా 1999, డిసెంబరు 6న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆ రెండురోజుల మధ్య ఉన్న వారాన్ని అంతరిక్ష వారంగా ప్రకటించబడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక అంతరిక్ష కార్యక్రమం. 2017లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవం సందర్భంగా 82 దేశాలలో 4వేలకంటే ఎక్కువ…
జంతు సంక్షేమం గురించి అవగాహన పెంచడానికి మరియు పెంపుడు జంతువులు, వన్యప్రాణులు లేదా వ్యవసాయ జంతువులు అయినా అన్ని జంతువుల రక్షణను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 4న ప్రపంచ జంతు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జంతు సంక్షేమ ప్రమాణాలను మెరుగుపరచడం మరియు వ్యక్తులు, సంస్థలు మరియు ప్రభుత్వాలు మార్పు తీసుకురావడానికి చర్య తీసుకోవాలని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ మరియు వన్యప్రాణుల ప్రపంచంలో జంతువుల దుస్థితిని పరిష్కరించడానికి అవసరమైన పని జరగాలని ఈ రోజు గుర్తు చేస్తుంది. ప్రపంచ జంతు దినోత్సవం ఇతివృత్తంతో వివిధ ప్రచారాలు, పోటీలు, కార్యక్రమాలు మరియు వర్క్‌షాప్‌లను నిర్వహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతర్జాతీయ జంతు దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 4న నిర్వహించబడుతుంది. జంతుసంపదను పరిరక్షించడం, వాటిని వృద్ధి చేయడంతోపాటు జంతువుల హక్కులను కాపాడటం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశం. అంతర్జాతీయ జంతు దినోత్సవం హీన్రిచ్ జిమ్మెర్మాన్…
1920: ప్రముఖ హేతువాది, వామపక్షవాది తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి జననం (మ.2013). 1947: ప్రఖ్యాత జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, క్వాంటం భౌతిక శాస్త్రానికి ఆద్యుడు అయిన మాక్స్ ప్లాంక్ మరణం (జ.1858). 1957: ప్రపంచపు మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1 ని సోవియట్ రష్యా ప్రయోగించింది. 1977: కన్నడ, తెలుగు సినిమా నటి సంఘవి జననం. 2004: మాజీ ఒరిస్సా ముఖ్యమంత్రి నీలమణి రౌత్రే కటక్ లో మరణించాడు (జ.1920). మాధవి కాళ్లసేకరణ
తల్లి ధరణి సమము తండ్రి నింగిని బోలుగురువులెల్ల క్రాంతి గుర్తులయ్యిబాలబాలికలిల ప్రభవింతురని నీవుతెలుసుకోర కృష్ణ తెలివితోడ! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట