Blog

Your blog category

మన స్నేహం

మన స్నేహం

అక్షర కొరకు అంశం - బ్రేకప్ కథలు రచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - మన స్నేహం నీతోనే ఉంటాననినీ వెంటే ఉండాలనిమనసు వాగ్దానం చేసిందితనువు మాత్రం దూరం చేసింది! చీకటి తెరలే కురులైరేయి కన్య ఎదురు చూసిందితరువు కొమ్మలు మెాడు వారిబ్రతుకు ఆగం చేసింది! రేయీ పగలూ నీ ధ్యాసేకొమ్మా రెమ్మతో నీ ఊసేకలిసి ఉండాలని తలంపేకలలోనైనా ఇదే తంతే! అచ్చట్లూ ముచ్చట్లూ నీతోనేఆలసి సొలసినా నీ కోసమేమరవ లేను కద నీ ప్రేమఈ జన్మకింతే కడవరకైనా! కొమ్మ మీది కోయిల గానంఅమ్మ మీది ప్రేమను తొలగించినీతో జత కట్టేలా చేసిందిదేవుడు మాత్రం మన ప్రేమనుదూరం చేసాడు! ఇది నా స్వీయ రచన..
Read More
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి(రచయిత)

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి(రచయిత)

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, 20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత (1891 ఏప్రిల్ 23 - 1961 ఫిబ్రవరి 25). భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఇతను పేరెన్నిక గన్నవారు.ఇతని జీవితం ఒక సంధి యుగంలో గడిచింది. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, పాశ్చాత్య నాగరికత మరొక పక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయికని తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించేడీయన. వేదవేదాంగాలు తరతరాలుగా అధ్యయనం చేసే కర్మిష్టులూ, పండితులూ అయిన కుటుంబంలో పుట్టి, సంస్కృతానికి స్వస్తి చెప్పి, తెలుగులో చిన్న కథలని రాయటం ప్రవృత్తిగా ఎన్నుకుని ఆ చిన్న కథకి కావ్యప్రతిపత్తి కలిగించిన సాహిత్య శిల్పి, సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆయన ఆత్మకథ పేరు అనుభవాలూ-జ్ఞాపకాలూనూ. సుబ్రహ్మణ్యశాస్త్రి 1891 ఏప్రిల్ 23 న తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మహలక్ష్మీ సోదెమ్మ, లక్ష్మీపతి సోమయాజులు.…
Read More
కీళ్ళ కొలిమి అంటుకుంది,,,,,!!

కీళ్ళ కొలిమి అంటుకుంది,,,,,!!

ఈ కారుమబ్బుల నిండా మంటలు చెలరేగుతున్నాయిఈ నీడలు మర్మగర్భిత నిప్పుల కళ్ళు తెరుచుకుని చూస్తున్నాయిశరీరంలోని అస్థిపంజరంలో ఏ కీలుకు ఆ కీలు కిర్రు కిర్రుమంటూ ఏళ్లతరబడి అరిగి అరిగి అగ్గిరవ్వలు రాజుకుని పెడబొబ్బలు పెడుతున్నాయి,,,,,,,,భుజం కీలు అక్షరాలు రాసి రాసి అరిగి నరాల్లో నొప్పి భయంకరమైన భీభత్సం సృష్టిస్తోంది,,,,,,,,,రాసే అక్షరాలతో కళ్ళు తెగిపడుతున్నాయా ఏమో మూర్ఛిల్లి సోలిపోతున్న పదం పదం దీనంగా దిగాలుగా,,,,,,,,,,వేళ్ళల్లో కీలు కీలుకు గ్రీజు రాసి ఎంతని లిఖించను కళ కోల్పోయిన నొప్పి భాష్యాలను,,,,,,,,,మనస్సు నిండా నొప్పి తాలూకు గోప్యమైన బాధాతప్త లోగిలిలో నరకతుల్య జీవితం నిద్రలేని రాత్రుళ్ళు అక్షరం అక్షరం రక్తం చిందిస్తూ పుటలన్నీ ఎరుపెక్కిన నరకశిక్షల నరాలపోట్లు నా అక్షరాలు,,,,,,,,,,,నా మార్గంలో కదిలే కాళ్ళల్లో కీళ్ళు పీకేసి పాకుడురాళ్ళు పెట్టుకుని ఎంతోదూరం వెళ్ళలేనని వెక్కిరించే లోకానికో సలాం సలాం నా పథం నాది ఎవరికీ లొంగను గాక లొంగను,,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
జ్యోతిర్మయం కొత్తకాపురం

జ్యోతిర్మయం కొత్తకాపురం

జ్యోతిర్మయం కొత్తకాపురం చీకట్లను చీల్చే కాంతులుచిందే ఆశాజ్యోతి నవవధువు నూతన గృహప్రవేశం,,,,,నుదుట తిలకం దిద్దుకుని మేలిముసుగు ధరించిన మురిపాల కొత్త ఇల్లాలు,,,,,,తమ కొత్త కాపురం ఆశల హరివిల్లు విరిసే ఆనందాలతో శోభాయమానం కావాలని దీపారాధన చేస్తున్న ముగ్దమనోహరి,,,,ఆ చంద్రుడు అచ్చెరువొందే మోముతో కొత్త కాపురంలోకి అడుగిడుతూ,,,,,ఆ దీపకాంతుల కిరణాలలో అగుపించే దివ్య దైవస్వరూపిణి,,,,,రెక్కలు తొడిగిన ఆశలతో మగని హృదయం కొల్లగొట్టి కాపురం సుఖమయం చేసుకోవాలని దీపారాధనతో దివ్యమంగళ రూపిణి సుఖశాంతుల సౌభాగ్యవతి,,,,,నీ ఆశలు అరవిరిసిన గులాబీ ఘుమఘుమలలో గృహం దేదీప్యమానం జ్యోతి ప్రజ్వలనలో,,,,,తల్లిదండ్రులను,తోబుట్టువులను వదలి అత్తారింటి గృహప్రవేశం చేసిన నూతన వధువు కలలు కళాఖండాలు,,,,,,మగని హృదయంలో కొలువైవుండే సుందరి సుశోభిత ప్రేమ భాష్యాలు దీపంజ్యోతులు,,,,నీ కాపురం పాలవెళ్ళి తరగలలో రమ్యమైన రంగవల్లి కావాలని ఆశించి దీవించే అత్తమామల అదృష్ట దేవతవు,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
ఉ!!మా!!💐💐💐

ఉ!!మా!!💐💐💐

రాలిన వారలెల్ల మన రాతలు మార్చిన దేవదూతలే!పాలన జేసి పెంచగను వ్రాలిన వేళను తోడునిల్చుచున్!జాలిని చూపి చిత్తమున చాకిరి చేయుచు మాతృదేవతన్లాలన సల్పుచున్ పగలు రాత్రులు సుస్థిరముంచ మేలగున్!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More
పౌర్ణమి

పౌర్ణమి

మనస్సు పౌర్ణమి నాటి గుప్పున విరిసే వెన్నెల, నక్షత్రాల చమక్కుల గూడుయైతే,అలాగే మనస్సు ఓ గాలిగోపురం చుట్టూ ఎగురుతూ, వాలుతూ రంగు రంగుల పక్షుల కోలాహలం చెంతలో హృదయం ఉల్లాసంగా తేలిపోయే వెల్లువవును,అప్పటివరకు కారుచీట్లలో మగ్గిన మనస్సు తేలికపడి ఉత్తేజితమై జీవితం మనోరంజకమవును.,,,,,,అపరాజిత్సూర్యాపేట
Read More
ప్రేమ సమాధి,,,,,,!!

ప్రేమ సమాధి,,,,,,!!

నేను పేగుకు వేలాడుతూ తన్నుకునే వేళ తెంచి భూమిపై పడేస్తే బిగ్గరగా రోదిస్తూ తల్లి కళ్ళల్లో పసిప్రేమ చవిచూశాను,,,,,శతకోటి మనుష్యుల ప్రేమలు కరువైన బంధాల యవ్వనంలో ఓ ఎర్రని అమ్మాయిలో ప్రేమ రంగరించి పోశాను ,,,,,నన్ను నట్టేటిలో తోసేసిందాక రంగులు మార్చే ఊసరవెల్లి హృదయం అమ్మాయదని అర్ధం కాలేదు,,,,,,,ప్రేమలు సెక్స్ వాంఛలతో తపించే యవ్వనం ఇప్పుడు మూగరోధన అనుభవిస్తోంది,,,,,తింగరి వెస్ట్రన్ సంగీతంలా ఈ ఏ ఆర్థిక వెసులుబాటు స్థిరత్వం లేని యవ్వనం పూసిన ప్రేమలనే ఎర్రగులాబీలు,,,,,,,,కాసిన్ని డబ్బులు చేతులను ఆడించేది తల్లిదండ్రుల కష్టం,ప్రేమలనే నగుబాట్లు కల్లోలభూయిష్టం కామ కోరికలతో మనస్సు దయ్యాల గుహ ఔను,,,,,,,ముఖం కవళికల్లో రంగులు మార్చే ప్రేయసి కల్లబొల్లి కబుర్లు ఇప్పుడు నాకంటే డబ్బున్నవాడితో ఎగేసుకెళ్ళింది,,,,,,,,నా ఘుమఘుమల ప్రేమ గుబులు గూడు మనస్సు తల్లడిల్లి తనువు చాలిస్తానంటోంది,,,ఈ మనోవ్యాకులత ఎన్నాళ్ళైనా తిష్టవేసుకుని ఉంటుంది డబ్బులున్నాయి కదా,,,,,జన్మనిచ్చిన తల్లి పసిప్రేమ కోసం కెవ్వుమని ఏడ్చాను, మోసకారి డబ్బు డాబుసరి ప్రేమ…
Read More
తల్లిదండ్రులు

తల్లిదండ్రులు

పుణేలోని ఒక పెద్ద శ్మశానవాటికలో మధ్యాహ్నం 3:00 అయ్యింది. అమెరికాలోని ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న రోహన్ (35), ఫ్లైట్‌ దిగిన వెంటనే నేరుగా శ్మశానానికి వచ్చాడు. అతని తండ్రి సదాశివరావు (75) గత రాత్రి మరణించారు. రోహన్ చేతిలో ఖరీదైన ల్యాప్‌టాప్ బ్యాగ్, కళ్లపై రే-బాన్ గ్లాసులు.చెమటలు కారుస్తూ, తరచూ గడియారం చూస్తూ నిలబడ్డాడు. అక్కడ “మోక్ష ఈవెంట్ మేనేజ్‌మెంట్” అనే అంత్యక్రియల సేవల సంస్థకు చెందిన సుమిత్ ఉన్నాడు.అన్నీ సిద్ధం చేశాడు. మంటకట్టెలు పేర్చబడ్డాయి, పూజారి వచ్చాడు,🙏సదాశివరావు గారి శరీరాన్ని స్నానం చేయించి సిద్ధం చేశారు. రోహన్ వచ్చి తన తండ్రి ముఖాన్ని ఒకసారి చూశాడు. రెండు కన్నీళ్లు జారాయి. అప్పుడు సుమిత్‌ను అడిగాడు: “మిస్టర్ సుమిత్, అన్నీ రెడీనా?నాకు సాయంత్రం 6 గంటలకు రిటర్న్ ఫ్లైట్ ఉంది.రేపు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది.దయచేసి త్వరగా ముగించండి.” 🙄 సుమిత్ షాక్ అయ్యాడు.ఈ కొడుకును…
Read More
ముళ్ళపూడి వెంకటరమణ(తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత)

ముళ్ళపూడి వెంకటరమణ(తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత)

ముళ్ళపూడి వెంకటరమణ (జూన్ 28, 1931 - ఫిబ్రవరి 24, 2011) ఒక తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు వ్రాశాడు. ముఖ్యంగా తన హాస్యరచనలకు ప్రసిద్ధుడయ్యాడు. ఇతను వ్రాసిన పిల్లల పుస్తకం బుడుగుకు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన బాపు కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు. ఆయన ఆత్మకథ కోతి కొమ్మచ్చి అనే పుస్తక రూపంలో వెలువడింది. బాపు మొట్టమొదటి సినిమా సాక్షి నుండి బంగారు పిచిక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్ళి పుస్తకం, మిష్టర్ పెళ్ళాం, రాధాగోపాలం వంటి సినిమాలకు రచయిత. 1995లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ నుండి శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం అందుకొన్నాడు. ముళ్ళపూడి వెంకటరమణ 1931 జూన్ 28 న ధవళేశ్వరంలో జన్మించాడు. ఇతని అసలుపేరు ముళ్ళపూడి వెంకటరావు. తండ్రి సింహాచలం గోదావరి…
Read More
దేవులపల్లి కృష్ణశాస్త్రి(తెలుగు కవి)

దేవులపల్లి కృష్ణశాస్త్రి(తెలుగు కవి)

దేవులపల్లి కృష్ణశాస్త్రి (నవంబర్ 15, 1897 - ఫిబ్రవరి 24, 1980) తెలుగు కవి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ముఖ్య అధ్యాయం. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందారు. చిన్న వయసునుండే రచనలు ఆరంభించారు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని చంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1న జన్మించారు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్ఠి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించారు. పిఠాపురం హైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని…
Read More