Blog

Your blog category

తుర్లపాటి కుటుంబరావు(పాత్రికేయుడు, రచయిత, వక్త)

తుర్లపాటి కుటుంబరావు(పాత్రికేయుడు, రచయిత, వక్త)

తుర్లపాటి కుటుంబరావు (ఆగస్టు 10, 1933 - జనవరి 11, 2021) పాత్రికేయుడు, రచయిత, వక్త. చిన్నప్పడే నార్ల వేంకటేశ్వరరావు గారి సంపాదకీయాలకు ప్రభావితుడై పత్రికారచన ప్రారంభించాడు. 2002 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో పాటు మరెన్నో పురస్కారాలు పొందాడు. తన 60ఏళ్ల పైబడిన పాత్రికేయవృత్తిలో 30, 40, 50, 60 వార్షికోత్సవాలను ప్రముఖుల చేతులమీదుగా జరుపుకొన్న వ్యక్తి. 1993 నాటికి పదివేలకు పైబడి బహిరంగసభలకు అధ్యక్షోపన్యాసాలు చేసి మంచి వక్తగా పేరుతెచ్చుకున్నాడు. అర్ధశతాబ్ది కాలంలో ఏ పదవి లేకుండా కేవలం ఉపన్యాసకుడుగా సభలకు అధ్యక్షునిగా వ్యవహరించిన వ్యక్తి తుర్లపాటి కుటుంబరావే నని గిన్నిస్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు పేర్కొన్నాడు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చివరి అధ్యక్షునిగా పనిచేశాడు. తుర్లపాటి కుటుంబరావు ఐదుగురు సహోదరులలో మధ్యముడు. తనకు అక్క, అన్న, తమ్ముడు, చెల్లి ఉండడంతో ప్రతి విషయంలో ఆలోచనలు మధ్యమ మార్గంగా ఉండేవని…
Read More
కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె(రచయిత, తెలుగు పండితులు)

కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె(రచయిత, తెలుగు పండితులు)

భాషాప్రవీణ కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె (1936 ఫిబ్రవరి 1 - 2016 జనవరి 11) రచయిత, తెలుగు పండితులు.1936, ఫిబ్రవరి 1 న చిత్తూరు జిల్లా తలుపులపల్లె గ్రామంలో కృష్ణమ్మ కుమారస్వామి దంపతులకు జన్మించారు. ఉన్నత పాఠశాల విద్య మదనపల్లె, పలమనేరులలోనూ, ఇంటర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి, భాషాప్రవీణ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పొందారు. ఆపై చిత్తూరు జిల్లాలో అనేక ఉన్నతపాఠశాలల్లో తెలుగు పండితులుగా పనిచేసి 1994 లో కలిచెర్లలో పదవీ విరమణ చేసారు. వారు సంస్కృతంలో రాసిన కలిచెర్ల పట్టాభిరామ సుప్రభాతం, సీతాష్టకం, పోలేరిమాతాస్తోత్రాలను నేటికీ చిత్తూరులోని పలు దేవాలయాల్లో సుప్రభాత సమయాన వేస్తారు. ఆయన తెలుగు పద్యకావ్యం "విషాద మాథవి"కి ముందుమాట రాసిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య "పద్య విద్య తెలిసిన కవి" అని ప్రశంసించారు. తరువాతి పద్యకావ్యం "చరిత్రకెక్కిన మారణహోమం" అత్యాధునిక స్త్రీవాద భావాలతో కూడిన ఈ రెండు గ్రంథాలకూ మూల కథలు మహాభారతంలోనివి. మరో పద్యకావ్యం…
Read More
ఆరోన్ స్వార్ట్జ్(ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు, అంతర్జాల కార్యకర్త)

ఆరోన్ స్వార్ట్జ్(ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు, అంతర్జాల కార్యకర్త)

ఆరోన్ హిల్లెల్ స్వర్ట్జ్ (నవంబర్ 8, 1986 - జనవరి 11, 2013), ఆరోన్ స్వ్ అని కూడా పిలుస్తారు , ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ , వ్యవస్థాపకుడు, రచయిత, రాజకీయ నిర్వాహకుడు మరియు ఇంటర్నెట్ హాక్టివిస్ట్ . ప్రోగ్రామర్‌గా, స్వర్ట్జ్ వెబ్ ఫీడ్ ఫార్మాట్ RSS ; కాపీరైట్ లైసెన్స్‌లను రూపొందించడానికి అంకితమైన సంస్థ అయిన క్రియేటివ్ కామన్స్ కోసం సాంకేతిక నిర్మాణం ; మరియు పైథాన్ వెబ్‌సైట్ ఫ్రేమ్‌వర్క్ web.py. స్వర్ట్జ్ తేలికపాటి మార్కప్ లాంగ్వేజ్ ఫార్మాట్ మార్క్‌డౌన్ యొక్క వాక్యనిర్మాణాన్ని నిర్వచించడంలో సహాయపడింది మరియు సోషల్ న్యూస్ అగ్రిగేషన్ వెబ్‌సైట్ రెడ్డిట్‌కు సహ-యజమాని మరియు 2007లో కంపెనీని విడిచిపెట్టే వరకు దాని అభివృద్ధికి దోహదపడింది. అతను తరచుగా అమరవీరుడు మరియు అద్భుత వ్యక్తిగా గుర్తింపు పొందాడు , మరియు అతని పనిలో ఎక్కువ భాగం పౌర అవగాహన మరియు ప్రగతిశీల క్రియాశీలతపై దృష్టి సారించింది. 2006లో…
Read More
సుకుమార్ (తెలుగు చలన చిత్ర దర్శకుడు, రచయిత)

సుకుమార్ (తెలుగు చలన చిత్ర దర్శకుడు, రచయిత)

సుకుమార్ (తెలుగు చలన చిత్ర దర్శకుడు, రచయిత) సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత. దర్శకుడు కాక ముందు గణితం అధ్యాపకుడు. 2004లో ఇతని మొదటి చిత్రం అల్లు అర్జున్ తోఆర్య సంచలన విజయం సాధించి అల్లు అర్జున్ను స్టార్ గా నిలబెట్టింది. రెండవ చిత్రం హీరో రామ్ పోతినేని తోజగడం టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. మూడవ చిత్రం ఆర్య 2 అల్లు అర్జున్ నడవలేదు. నాల్గవ చిత్రం 100% లవ్ అక్కినేని నాగ చైతన్య సరి కొత్త కథతో యూత్ ని బాగా ఆకట్టుకొని మంచి విజయాన్ని నమోదు చేసింది. అందులోని పాటలు ప్రజాదరణ పొందాయి. 2014 లో మహేష్ బాబు తో 1 - jiనేనొక్కడినే చిత్రాన్ని తీశారు. అది ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. 2016 లో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నారు. 2018…
Read More
శ్రీనివాస్ రామడుగుల(కవి సంగమంలో కవిత్వం వ్రాస్తుంటారు, భోపాల్ లో నివసిస్తున్నారు. దూరదర్శన్ కేంద్రంలో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు)

శ్రీనివాస్ రామడుగుల(కవి సంగమంలో కవిత్వం వ్రాస్తుంటారు, భోపాల్ లో నివసిస్తున్నారు. దూరదర్శన్ కేంద్రంలో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు)

శ్రీనివాస్ రామడుగుల పూర్తిపేరు రామడుగుల వెంకట సత్య సూర్య శ్రీనివాస్. తెలుగు యువకవులలో ఒకరు. ఇతని కలం పేరు "శ్రీ". కవి సంగమంలో కవిత్వం వ్రాస్తుంటారు.రామడుగుల సీతారామం, సూర్య గంగాధరం దంపతులకు 1968 జనవరి 11న తూర్పు గోదావరి జిల్లా రంగాపురం గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం భోపాల్ లోని దూరదర్శన్ కేంద్రంలో ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు.ఇతని వివాహం సత్యలక్ష్మితో జరిగింది. ఇతనికి ఒక కుమార్తె (సింధూజ). "శ్రీ వాక్యం" (ఏక వాక్య కవితల సహస్రం) 2013 సెప్టెంబరు 1 న విశాఖపట్టణంలో రోజా డాన్స్ అండ్ ఆర్ట్ అకాడమీ వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది."మనసంతా నువ్వే" (దీర్ఘ కవితల సంపుటి) 2014 జనవరి 11 న హైదరాబాదులో సి నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. 2013 సెప్టెంబరులో విడుదల చేసిన శ్రీవాక్యానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి అవార్డు 2014 సెప్టెంబరు 1న హైదరాబాద్ లో."ప్రేమను…
Read More
నలుడు దమయంతికి వ్రాసిన లేఖ

నలుడు దమయంతికి వ్రాసిన లేఖ

అక్షరలిపి అంశంప్రేమ లేఖల పోటీ శీర్షికనలుడు దమయంతికి వ్రాసిన లేఖ ప్రియమైన దమయంతి దేవీ,నీ సౌందర్యం మాత్రమే కాదు, నీ పవిత్ర ప్రేమ నా మనసుకు నచ్చింది. నిన్ను చూడక ముందే నీ గురించి నాకు తెలిసినా, నిన్ను చూశాక నీపై ప్రేమ మరింతపెరిగింది.రాజ్య సుఖాలు, వైభవాలు అన్నీ నాకు నీ ప్రేమ ముందు తక్కువే అనిపించాయి.ప్రతి క్షణం నీ రూపమే నా కళ్ల ముందు నిలుస్తోంది. నీప్రేమ వచనాలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. నా జీవిత యాత్రలో నీవే నా దిక్సూచి, నువ్వే నా అనురాగ దేవతవు. నీ ప్రేమను పొందాలనే తపన నా హృదయంలో ఉంది ‌దమయంతి, విధి ఎంత కఠినంగా పరీక్షించినా,కాలం ఎంత దూరం వేసినా, నా ప్రేమ మాత్రం నిన్ను విడిచిపెట్టదు. నా శ్వాస ఉన్నంతకాలం నీ పేరు నా హృదయంపై చెక్కబడినట్లే ఉంటుంది. నీవు నా జీవితంలోకి వరమై వచ్చావు. నువ్వు నాకు…
Read More
నవయవ్వనం సౌందర్యం పొంగు

నవయవ్వనం సౌందర్యం పొంగు

నవయవ్వనం సౌందర్యం పొంగు,,,,,,!! కౌమారదశ వీడి యవ్వనంలోకి అడుగిడుతూతెలిసీ తెలియని వయస్సులొనేకాలుజారి కమ్మని కలలు పండించుకుంటున్నట్లు భ్రమసి,,,,,,,,,ప్రేమ ఊసుల పావురాలని పొగడ్తల అగడ్తలు తెలిసిన లోకం నిండా,,,,,,,,చదువుకోండిరా అని తల్లిదండ్రులు పట్నం పంపిస్తే గుండెకోత మిగులుస్తారని ఊహించలేదు,,,,,,,,,అతి చిన్నవయస్సులో విడదీయరాని ప్రేమ బంధంలో చిక్కుకున్న ఆకర్షణీయమైన వస్త్రధారణ మేకప్పులు,,,,,,,,సినిమాలు శికార్లే జీవితమనుకునిప్రేమ నయనాలు పలికే ఇరువురి తొలిపొద్దు అందాలుఆకర్షణీయమైన నవయవ్వనం పొంగులోఏం చేస్తున్నారో తెలియని స్థితిఒకరినొకరు విడదీయరాని ఆకర్షణలో తీపి కబుర్లకు చేదు వాస్తవం తెలిసొచ్చి,,,,,,,,ఇరువురి సాన్నిహిత్యం గుర్తుచేస్తూ కాలం తనపనిగా అమ్మాయి గర్భందాల్చిఇరు గులాబీలు వినీల ఆకాశం కింద కాలం చేతిలో చిరుప్రాయులు పావులు,,,,,,,ఇంటర్మీడియట్ చదువులు గంగపాలు చేసుకున్న వైనం,,,,,,,,తల్లిదండ్రులు చదువుకొమ్మని పట్నం పంపించి ఇష్టమొచ్చినట్లు డబ్బులు పంపిస్తుంటే విచ్చలవిడి తిరుగుళ్ళు,,,,,,,గుండెలదిరిపోయే సాదృశ్యం చవిచూసి ఏం చేయాలో పాలుపోని దుస్థితి,,,,,,ఇంటర్ చదువులకు ఉద్యోగం ఎవ్వరూ ఇవ్వరుగాక ఇవ్వరు,,,,,,ఇద్దరూ గుబులు అగ్నిశ్వాసల్లో గుండెల్లో రైళ్లు పరుగెడుతూ,,,,,,,,తొలియవ్వనం సినిమా కళ్ళల్లో తేలియాడుతూ సముద్రపు…
Read More
బడిపంతులు ఆవేదన

బడిపంతులు ఆవేదన

బడిపంతులు ఆవేదన మలి సంధ్య వేళరివ్వున వీచే పిల్లగాలుల్లోకోడేనాగులా దూసుకెళ్తున్నకాలువ పక్కన ఏకాంతంగానేను నేనుగాని అశాంతిలోరివ్వున రివరివ మంటున్నవిషాద ఛాయల జ్ఞాపకాలుఒరలోంచి ఖడ్గం తీసినా కంఠాన్ని ఖండించేవిగాదూరంగా కొండల్లో గుడ్లగూబ కూస్తోందినేను కన్న కలలు కన్నీటి సిరాచుక్కలై రాలిపడుతూఅక్షరాల కాగితాలన్నీ వాడిపోయిన పూవులైభారమైన బడిపంతులు ఉద్యోగంఒకప్పుడు ఈ చేతులతో అక్షరాలు నేర్చిన పిల్లలువినయ విధేయతలకు గీటురాళ్లుకాలం మారింది పిల్లలిపుడు కొరకరాని కొయ్యలుఏదో చెప్పాలనే తపన తొలిచేస్తుంటేఈ పిల్లలు నా కంఠాన్ని తెగ్గోసుకున్నా పెడచెవిన పెడుతున్న చందం,,,,,,ఏం చదువులు అయ్యాయి!?!తెగి ఎక్కడో పడుతున్నా గాలిపటాలు నేర్వగాలేని సంస్కార హీనులు పిల్లలు ,,,,,,,,,,,ఈ కాలువ గట్టున ఆలోచనలకు అదుపులేదు,,,,,నా బాధాతప్త మూహాన్ని కాలువ నీటిలో కడుక్కునిఈ రిటైర్మెంట్ వయస్సులో ఏమీ చేయలేని దుస్థితినా అక్షరాలన్నీ నామీదే గుమ్మరించుకున్నట్లుగుంపులో గోవిందయ్య నవుతుంటేఓపికలు చచ్చిన వయస్సు మీదపడుతూభవిష్యత్తరాలను ఉహించుకుంటేనే భయమేస్తోంది,,,,,,,పొద్దుకుంగుతుంటే తదేకంగా చూస్తో నిష్క్రమిస్తున్నా అక్కడినుండి,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
ఆలంబన!

ఆలంబన!

ఆలంబన! దీపాలు పెట్టే వేలాయెనీవు రావైతివి ప్రియతమాకాటుక కళ్ళు వేచి వేచికన్నీళ్ళ పర్యంతమయికురిసే వెన్నెలలుజాలిగా చెట్ల క్రీనీడల్లోఆడుకునే పిల్లలుఅటుతరువాతతత్వాలు పాడే బైరాగితీతువు పాడే పాటలునా గుండెల్లో రైల్లు పరుగెడుతూఆ ఏడుకొండల స్వామిని వేడుకుంటూసుఖధుఖాల్లో మనం ఒకటిగామన కాపురాన్ని పూల తోటలాచిన్న ఇల్లయినా చింతలెరుగకనా మనసంతా పందిరి వేసివాకిలిలో ఏకాంతంగానీ రాక కోసం కనులు కాయలు కాయగానీవేల ఇంత రాత్రి దాకా రావేల!?క్షణాలన్నీ యుగాలుగా తరగిపోకమనసు ఏదో కీడు శంకిస్తూఇలాగే ఇలాగే వేచి వేచి నిద్రలోకి జారుకున్నాతెల తెలవారుతుండగానా భుజం పట్టి పైకి లేపిఉన్నాను నీ కోసం వచ్చాఏదీ నీ కమ్మటి కాఫీ!?రేయంతా నడచి నడచి వచ్చా నీ పరిశ్వంగన కోసంమన బంధం చాలా బలమయినది సుమీ!! అపరాజిత్సూర్యాపేట
Read More
ఆ!!వె!!!🌺🌺🌺

ఆ!!వె!!!🌺🌺🌺

జాతక చక్రవర్తివని శంకర మీకివె జోతలిత్తునే!మాతగ పార్వతమ్మకిట మానుషులెల్లను పూజసేయగన్!నూతన జీవితమ్మొసగ నోరిమి తోడను మాకు నెల్లెడన్శీతలమానసమ్ముగను శీఘ్రమె నీయగ చేరుకోవయా!! పట్టుబట్టి జదువ ప్రాపంచమెరుగునుప్రజల మధ్య దిరుగ ఫలముదక్కు!మంచిమనసుతోడ మహిని గెలవ వచ్చుతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! కం!!!🌺🌺🌺 ముద్దుగ బట్టలు దొడుగుచుపద్ధతిగా మగువలున్న బహు గౌరవమే!హద్దులు దాటిన వేళనుదద్దమ్మా యంచు తిట్టు ధరణిని కృష్ణా!! ఉ!!మా!!🌺🌺🌺 జాతక చక్రవర్తివని శంకర మీకివె జోతలిత్తునే!మాతగ పార్వతమ్మకిట మానుషులెల్లను పూజసేయగన్!నూతన జీవితమ్మొసగ నోరిమి తోడను మాకు నెల్లెడన్శీతలమానసమ్ముగను శీఘ్రమె నీయగ చేరుకోవయా!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More