Blog

Your blog category

అమ్మ లే (ఖ) క

అమ్మ లే (ఖ) క

అంశం : అక్షర పోటీ కొరకు శీర్షిక : అమ్మ లే (ఖ) క చిన్నా బాగున్నావా, అమ్మా ఎలా ఉన్నావ్ అని నువ్వు అడగాల్సింది కానీ నేను అడుగుతున్న చూడు ఇదే విచిత్రం రా నాకు మూడో సంతానం వద్దు అన్నారు కానీ నేను మాత్రం పట్టుపట్టి నిన్ను కష్టపడి కన్నానురా ఆ తర్వాత కష్టమైనా ఇష్టంగా పెంచుకున్నా రా ఆ తర్వాత మెల్లిగా చదువులో వెనకపడిన నాన్న తిట్టినా వెనకేసుకుని వచ్చిన ఎన్నోసార్లు నిన్ను కాపాడుకున్న కానీ ఉద్యోగం తర్వాత నాకు తెలియకుండా చేసిన అప్పులన్నీ నాకు తెలిసాక అవన్నీ దగ్గరుండి మరి ఒక్కో రూపాయి దాచినవన్ని తీసి అప్పులన్నీ తీర్చేసి ఎవరో వేదిస్తున్నారు అంటే భయపడకు బిడ్డ నేనున్నా అని ధైర్యం చెప్పిన, కరోనా లో దూరంగా ఉన్నప్పుడు కూడా నీకు జీతం వచ్చినా సరిపోవడం లేదంటే అప్పుడు పంపిన అక్కా, అన్న నీకు వాడంటేనే ఎక్కువగా…
Read More
పసునూరి రవీందర్ (కవి, రచయిత)

పసునూరి రవీందర్ (కవి, రచయిత)

పసునూరి రవీందర్‌ కవిగా, రచయితగా తెలుగు సాహితీ జగత్తుకు సుపరిచితుడు. తెలంగాణ రాష్ట్రం నుండి తొలిసారిగా కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కారం అందుకున్న రచయిత. తెలంగాణ ఉద్యమ గేయసాహిత్యంపై హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్‌ అందుకున్నారు. వరంగల్‌ జిల్లా శివనగర్‌ ప్రాంతంలో 1980 జనవరి 8న జన్మించారు. "ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు సాహిత్యం -విమర్శ"అనే అంశం మీద ఎంఫిల్‌, "తెలంగాణ గేయసాహిత్యం-ప్రాదేశిక విమర్శ"అనే అంశంపై పి.హెచ్‌డీ చేశారు. పసునూరి రాసిన వ్యాసాలు పలు దిన, వార పత్రికల్లో అచ్చయ్యాయి. 'దస్కత్'తెలంగాణ కథా వేదికకు కన్వీనర్‌గా పనిచేసారు. తెలంగాణ ఉద్యమంలో సాహిత్యకారులను కూడగట్టి ఉద్యమ బాట పట్టించిన "సింగిడి" తెలంగాణ రచయితల సంఘానికి కన్వీనర్‌గా పనిచేశారు. తాను రాసిన అవుటాఫ్ క‌వ‌రేజ్ ఏరియా క‌థా సంపుటికి కేంద్ర‌సాహిత్య అకాడెమి యువ‌ పుర‌స్కారం ల‌భించింది. జాషువా, బోయి భీమ‌న్నల త‌ర్వాత‌ సాహిత్య అకాడెమి చేత గౌర‌వాన్ని అందుకున్న ద‌ళిత ర‌చ‌యిత ర‌వీంద‌రే.…
Read More
మామిడిపూడి వేంకటరంగయ్య(రచయిత , విద్యావేత్త, ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు)

మామిడిపూడి వేంకటరంగయ్య(రచయిత , విద్యావేత్త, ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు)

మామిడిపూడి వెంకటరంగయ్య (1889 - 1981) రచయిత, విద్యావేత్త, ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. ఈయన విజ్ఞాన సర్వస్వ నిర్మాత కూడాను.ఈయన 8 జనవరి 1889లో నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిణి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకటేశమ్, నరసమ్మ. బాల్యంలో తెలుగు, సంస్కృతం అభ్యసించిన తర్వాత ఆంగ్ల విద్య కోసం మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో చేరారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1907 లో బి.ఎ.పరీక్షలో మొదటి తరగతిలో మొదటివాడిగా ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చయప్ప కళాశాలలో పనిచేస్తూ అదే విశ్వవిద్యాలయం నుండి చరిత్ర, ఆర్థిక, రాజకీయ శాస్త్రాలలో ఎం.ఏ. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. చదువుతున్న కాలంలోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ప్రముఖ రచయిత, విద్యావేత్త, ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. ఈయన విజ్ఞాన సర్వస్వ నిర్మాత. రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రోత్సాహం మీద కాకినాడ లోని పిఠాపురం రాజావారి కళాశాలలో చరిత్రాధ్యాపకులుగా 1910లో చేరి 1914 వరకు నిర్వహించారు. తరువాత…
Read More
ప్రేమ లేఖల పోటీ..కొరకు

ప్రేమ లేఖల పోటీ..కొరకు

ప్రేమ లేఖల పోటీ..కొరకు పేరు:కళ నాకూ ప్రియాతిప్రియమైన మీకూ పంపుతున్న ఈ లేఖ.. మీకూ ఏమి కానీ బంధం పెనవిసుకున్న నేను.. ఇంత కాలానికి మళ్ళీ మీకూ లేఖ రాస్తున్నా.. బహుశా ఇదే నా చివరి లేఖ.. మనసున మరుగున పడిన జ్ఞాపకాల తోలి లేఖ.. కుశల ప్రశ్నలు అడగలేను… నిన్నూ చూడాలి అనీ ఆశ.. అది కూడా దూరం నుండే సుమ..ఎందుకో తెలుసా సాగిపోయినా కాలంలో చివరి మజిలీ మన బంధం ఎపుడో దాటివేసింది… నా నయనం నిన్నూ చూడాలి ఎంతలా అంటే కన్నీటి వర్షం సైతం లెక్కచేయకుండా.. అదే సమయంలో నా ఉనికి నీకూ తెలియకూడదు… మొహమాటం, భయం, బిడియం నా మనసుకు పడిన సంకెళ్లు తద్వారా నా గొంతు మూగబోయింది..కానీ ఇప్పుడు అన్ని దాటి గట్టిగా చెప్పాలి అనీ ఉంది… నువ్వంటే నాకూ ఇష్టం… ఎంతలా అంటే నన్ను నేను మరిచేంతలా.. బంగారం అనే నీ ఒక్కసారి…
Read More
ప్రేమ లోని జీవితం

ప్రేమ లోని జీవితం

ప్రేమ లోని జీవితం లేతవయసుయువనరాలుతెలిసీతెలియనిభావాలువ్యతిరేకఆకర్షణఅయినామేము ఇద్దరంఒకటికావాలనే ఆశదేర్యంగామనసుముందుకేఊరికిస్తుంటేప్రియా….నాప్రేమ లేఖలుఎలావ్రాసానోభాష లేదుప్రాస రాదుఅయినానీకుమధురంగాహృదయానికిహత్తుకొనిగుండెల్లోదాచుకున్నావా…మనంకలిసాముకలిసి నడిచాంచివరి వరకుఒకరికిఒకరుతోడుమనంరాసుకున్ననీడలాప్రేమలేఖలాసాక్ష్యంగాచేసుకున్నబాసలుసృజి స్తూసృష్టిస్తూ….. మీఅల్లావుద్దీన్
Read More
ఆ!!వె!!🌺🌺🌺

ఆ!!వె!!🌺🌺🌺

బాలలేని యిల్లు వైకుంఠమదిగాదుగొడవలున్న గృహము గుడియు గాదు!యిట్టి రెండులేక నిదిరుద్ర భూమియౌతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
Read More
శ్రీ కృష్ణ పరమాత్మకు రాధ వ్రాసిన ప్రేమ లేఖ

శ్రీ కృష్ణ పరమాత్మకు రాధ వ్రాసిన ప్రేమ లేఖ

అంశంఅక్షరలిపి సంక్రాంతి ప్రేమ లేఖల పోటీ శీర్షికశ్రీ కృష్ణ పరమాత్మకు రాధ వ్రాసిన ప్రేమ లేఖ. ప్రియమైన కృష్ణా, నీవు నా కంటికి కనిపించకపోయినా, నా హృదయంలో నీవే ఉన్నావు. యమునా తీరంలో నీ వేణుగానం విన్న ఆ క్షణం నుంచి నా మనసు నీదైపోయింది. నీ చిరునవ్వే నాకు ఒక వరంలా అనిపిస్తుంది.నీ మాటల్లో ప్రేమ ఉంది, నీ చూపులో అనురాగం ఉంది. నీవు పక్కన ఉంటే కాలం ఆగినట్లుగా అనిపిస్తుంది.నా మనసు ఎప్పుడూ నిన్నే వెతుకుతోంది. నీవు చూపించే ఆ ప్రేమ స్వార్థం లేనిది.కృష్ణా, నీవు నా హృదయంలోనే వసించు.నీవు దూరంగా ఉన్నా, నీ మనసు నాకు దగ్గరగా ఉంటుంది. నా ప్రతి శ్వాసలో నీ నామమే ప్రతిధ్వనిస్తుంది. ఈ ప్రేమకు రూపం లేదు, పరిమితి లేదు. సదా నీప్రేమలో ఎప్పటికీ నీదైన,రాధ ఈ రచన నా స్వీయ రచనవెంకట భాను ప్రసాద్ చలసాని
Read More
భగవంతుడు

భగవంతుడు

భగవంతుడు రోజూ భగవంతునికి పూజ చేసే వారు కూడా…భగవంతుడు అంటే ఏమిటి? అంటే…..ఎంతోమంది సరైన సమాధానం చెప్పలేరు.కాబట్టి ఓపిక చేసుకుని… ఈ చిన్న కథను చదవండి. ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో… ముఖ్యంగా మూడు అర్దంకాని ప్రశ్నలు మెదడును తోలుస్తూ ఉన్నాయి.అవి…1.దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు?2.దేవుడు ఎక్కడ ఉంటాడు?3.దేవుడు ఏం చేస్తాడు?ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు. తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై… పండితులను, శాస్త్రకారులను, మేధావులను ఆహ్వానించాడు.తాను మూడు ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది. ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు.రాజాస్థానం చేరుకొన్నాడు. రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర…
Read More
చెలీ

చెలీ

అక్షర సంక్రాతి ప్రేమ లేఖ పోటీ కొరకు చెలీ ! నా నెచ్చెలీ!ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు?నువ్వు లేనిదే నేను లేను ఈ రోజునా కోసం ఎంతో చేసావు అను దినము ప్రతిక్షణం నిన్ను తలుచుకుంటూనే ఉంటా!మరి నీకు నేను గుర్తున్నానా? ఉండే ఉంటానులే! నీ హృదయం లో నా స్థానం అలాంటిది మరి నన్నెలా మర్చిపోతావు?నువ్వు మరవాలన్నా నేనెందుకు మరవనిస్తా!మనం కలిసి ఉన్న రోజులు ఎంత బాగుండేవి అసలు తలుచుకుంటేనే ఆ రోజుల్లోకి వెళ్లి పోవాలనిపిస్తుంది కదూ!మల్లె తోటలో ఆటలు మామిడి చెట్టుకు కట్టిన ఉయ్యాలలో ఊగడం ఎంత సరదాగా ఉండేది..వెన్నెల్లో కూచుని అమ్మ పెట్టిన భోజనం తింటూ చందమామతోచెప్పిన కబుర్లు గుర్తున్నాయా?మా తమ్ముడు తెచ్చుకున్న మామిడి పండ్లు మనం కొట్టేసి తిన్న రోజులు వాడు అలిగిన తీరు ఎంత బాగా ఎంజాయ్ చేసాం కదా! ఇప్పటి వాల్లకు ఆ తీపి గుర్తులే లేవు కదా!ఇసుక దిబ్బ లో పిట్ట…
Read More
రాసుకొన్న ప్రేమలేఖ

రాసుకొన్న ప్రేమలేఖ

అక్షర లిపి సంక్రాంతి కవితల పోటీ…అంశం : చిత్ర కవిత దేరంగుల భైరవ (కర్నూలు)కర్నూలు (జిల్లా)9100688396 శీర్షిక : రాసుకొన్న ప్రేమలేఖ…!!! అనురాగం చుట్టుముట్టిన ఆకారంరెండు మనస్సులను కలిపే ప్రేమాలయంప్రకృతితత్త్వం ప్రగతికి నిత్యం కావాలని…మదినే వేదికగా చేసుకొని నాకు నేనై…!!హృదయపూర్వకంగా రాసుకొన్న ప్రేమలేఖ… చదివే రోజులతో మొదటి పరిచయం…కదిలే రోజులతో పెరిగిపోయిన స్నేహం…తిరిగిన రోజులతో కట్టుకొన్న ప్రేమదేశం…రాసుకొన్న రాతలు చేసుకొన్న బాసలుదగ్గరైన చూపులు బంధంగా కావాలని…!!అనుదినాన్ని ప్రత్యేకించిన సమయాలతోవేచియున్నా జారిన సంధ్యలతో చెప్పకనేగ్రహణం మింగిన మత్తుగా మాయమైనది… తీపిగుర్తులుగా గడిపిన జ్ఞాపకాలెన్నున్నామరిచిన పరిస్థితులతో క్షణాలు మౌనమే…నమ్మకంలేని బలమేదో గుండె కవాటాలనుతెరిచి ఓదార్చిన గీతాన్ని ఆలాపించినా…!!కుదుటపడలేదు ఎదలోతుల్లో ఏదో లోపం…ఈ జీవితం ఎవరికోసమో అనిపించింది… మనస్సుతో మమేకమై మమకారాలతోరూపమై శ్వాసలతో లిఖితమైన నిర్ణయంతాలూకు అనుకోకుండా కనుమరుగైనా…!!అది ప్రేమకు గాయంగా ఈదని అగాధమే…కొలతబడని వేదనలు కొరివై కాల్చినవేనని…కపటమైన కనుల ప్రపంచంలో తేలుతు…ఆశలను అడుగకా ఆప్తులను నిలుపకా…నిలువని చీకటి వెలుగులతో చేదెక్కిపోయినిరాశలతో నిజాలు నీరుగారి పోయేవేననిఅనుభవంతో…
Read More