ఆత్మవిశ్వాసంతో
అక్షర అంతర్జాతీయ మహిళా దినోత్సవం పోటీ కొరకుఅంశం :- నేటి తరం ఆడపిల్లలు వారి మనస్తత్వంతేది:- 01/03/2026శీర్షిక:- ఆత్మవిశ్వాసంతో… చరిత్రలో మహిళలు ఎదుర్కొన్న వివక్ష,అన్యాయాలను గుర్తు చేసుకుంటూ,భవిష్యత్తులో సమాన అవకాశాల సమాజాన్ని నిర్మించాలనే సంకల్పానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది. ప్రాచీన కాలం నుండి ఆధునిక యుగం వరకు మహిళలు కుటుంబం, సమాజం, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. తల్లి, కుమార్తె, భార్య, సోదరి వంటి పాత్రలతోపాటు విద్యార్థిని, ఉపాధ్యాయురాలు, శాస్త్రవేత్త, వైద్యురాలు, కార్మికురాలు, నాయకురాలు వంటి అనేక రూపాల్లో మహిళ తన ప్రతిభను చాటుకుంది. అయినప్పటికీ, అనేక సందర్భాల్లో ఆమెకు సమాన హక్కులు దక్కకపోవడం, విద్య, ఉపాధి, నిర్ణయాధికారం వంటి రంగాల్లో వెనుకబడటం కనిపించింది. ఈ అసమానతలపై చర్చకు వేదికగా నిలిచింది మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం ఉత్సవం మాత్రమే కాదు! అది ఒక ఉద్యమ భావన. మహిళలపై జరుగుతున్న హింస, బాల్య వివాహాలు, లింగ వివక్ష, వేతన అసమానత…