క్రమశిక్షణ అవసరం

క్రమశిక్షణ అవసరం

క్రమశిక్షణ అవసరం

క్రమశిక్షణ అవసరం నేటి పిల్లల మనసులుస్క్రీన్‌ల వెలుగులో మునిగి…ఆకాశం కన్నా చిన్నదైపోతున్న కలలు!వేలు కదలికల్లో ప్రపంచం తిరుగుతోంది,కానీ పక్కింటి బాధ వినిపించడం లేదు;ఇది కాలపు వ్యథా కాదా?పుస్తకపు వాసన మరిచిపోయిన గదుల్లోజ్ఞానం డౌన్‌లోడ్ అవుతోంది,అనుభవం మాత్రం దూరమవుతోంది…ప్రశ్నలు గూగుల్ అడుగుతున్నాయి,కానీ మనసు మాత్రం ఎవ్వరినీ అడగడం లేదు;అది ప్రమాదం కాదా?సామాజిక బాధ్యత అంటే సెల్ఫీ కాదు,సాయం చేయడమే నిజమైన షేర్;ఇది ఎవరు చెప్పాలి పిల్లలకు?వృద్ధుడి చేతిని పట్టుకోవడం ఒక పాఠం,రోడ్డు దాటించడం ఒక విలువ,ఆకలికి అన్నం పెట్టడం ఒక మానవత్వం!పిల్లలారా…మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే కాదు,ఈ సమాజపు హృదయంలోనూ ఉంది! డా. భరద్వాజ రావినూతల
Read More