adhvitheeyah aksharalipi

అద్వితీయః 

అద్వితీయః  “పరీక్షిత్ మహారాజుకు ఆ పేరే ఎందుకు పెట్టారు? అతడు ఎందుకు ప్రాయోపవేశం చేయాల్సి వచ్చింది? శుకుడు అతడికి భాగవతం ఎందుకు వినిపించాల్సి వచ్చింది” అంటూ శౌనకాది మునులు సూతుణ్ణి ప్రశ్నించారు. సమాధానంగా పరీక్షిత్ మహారాజు జన్మ వృత్తాంతం తెలియజేయడానికి ముందు సూతుడు మహాభారతంలోని చివరి ఘట్టాన్ని వారికి వివరించాడు. శ్రీకృష్ణ నిర్యాణం, పాండవుల మహాప్రస్థానం మొదలయిన సంగతులు కొన్ని తప్పనిసరై చెప్పాల్సి వచ్చింది. పద్దెనిమిది రోజుల పాటు కురుక్షేత్రంలో కౌరవులకూ పాండవులకూ యుద్ధం జరిగింది. ఇరు పక్షాన మహావీరులు అనేకులు మరణించారు. గదాయుద్ధంలో భీముడు, తొడలు విరగగొట్టడంతో దుర్యోధనుడు నేల కూలాడు. ఆనాటికి కురురాజు పక్షాన మిగిలిన ఒకే ఒక్క వీరుడు అశ్వత్థామ. ధృతరాష్ట్రుడు నూరుగురు కొడుకుల్నీ, బంధు బలగాన్నీ, చతురంగ బలాల్నీ కోల్పోయి జీవచ్ఛవంలా ఉన్నాడు. ఆ మహారాజుకి సంతోషాన్ని కలిగించేందుకు అశ్వత్థామ ఘోరకృత్యానికి పూనుకున్నాడు. అర్ధరాత్రి వేళ నిద్రిస్తున్న ద్రౌపది కుమారులయిన ఉపపాండవుల తలలను నరికి వచ్చాడు.…
Read More