ఎందుకో చెప్పాలి అనిపించింది-లేఖ
ఎందుకో చెప్పాలి అనిపించింది-లేఖ లోకం లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. పనులు లేక, పైశల్ లేక, తినడానికి తిండి లేక, కట్టుకోనీకి బట్టలు లేక మస్తు బాధలు వడుతున్న జనాలున్నరు. గాసుంటి లోకం ల ఇంకొందరు సుతా ఉన్నారు. ఆల్లే పైసల కోసం పానాలు తిసేటోల్లు, సిన్న పిల్లలను మదమెక్కి కరాబు చేసేటోళ్ళు... పది రూపాల కోసరం పట్టపగలే హత్యలు సేసేటోళ్లు ఉన్నారు. గా పైసల కోసం గడ్డీ గాదం తింటూ లచ్చలు, కోట్లు సంపాదించుకునే టోళ్ళు ఉన్నారు. ఆళ్ళకి సూత సంపితే ఒక బాధ సంపకుంటే ఇంకో బాధ. తింటే ఒక బాధ తినకుంటే ఇంకో బాధ. రోగాలు, రోష్టులు, టానిక్కులు, మందులు, మంచింగులు, బిర్యానీ ముక్కలు ఒక దిక్కు అయితే, మురికి గుంటలు, గుట్కాలు, తెల్లచీరలు, మల్లే పూలు, బేర్ మంటున్న పోరల్లు... పాలకు గతి లేక నీళ్ళు రాక కన్నీళ్ళే మింగుతూ, గింత కండ కూడా కానరాని…