అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం
అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం, ప్రతి సంవత్సరం నవంబరు 8న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది. ఆధునిక ఆరోగ్య సంరక్షణలో రోగ లక్షణాల సూచిక పాత్రను ప్రోత్సహించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. యూరోపియన్ సొసైటీ ఆఫ్ రేడియాలజీ (ఇఎస్ఆర్), రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా (ఆర్‌ఎస్‌ఎన్‌ఎ), అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ (ఎసిఆర్) కలిసి సంయుక్తంగా 2012లో ఈ దినోత్సవాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200లకు పైగా జాతీయ, ఇతర సంస్థలు ఈ అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఎక్స్-రేను కనుగొన్న రోజును పురస్కరించుకొని ఈ దినోత్సవం జరుపబడుతోంది. 2011లో ప్రారంభించిన యూరోపియన్ రేడియాలజీ దినోత్సవం, ఆ మరుసటి సంవత్సరం అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవంగా మార్చబడింది. ఎక్స్-రే కిరణాలను కనుగొన్న విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ వర్ధంతి సందర్భంగా 2011, ఫిబ్రవరి 10న యూరోపియన్ సొసైటీ ఆఫ్ రేడియాలజీ ఆధ్వర్యంలో మొదటి, ఒకేఒక యూరోపియన్ రేడియాలజీ దినోత్సవం జరిగింది. ఆ దినోత్సవం…