బంధం
బంధం సృష్టిలో ప్రతీ ప్రాణికి ఏదో రూపంలో, ఎవరితో ఒకరితో బంధం ఏర్పడుతుంది. అన్ని ప్రాణులకన్నా, మానవ జన్మకు ఎక్కువ బంధాలు కలిగి వున్నాయి. మనిషి ప్రకృతితో, పశువులతో, పక్షులతో, మనుషులతో, జంతువులతో, జలచరాలతో కూడా బంధం ఏర్పరచుకున్నాడు. కానీ, మనిషికి అంత్యంత అమూల్యమైన బంధమైన తనతో తాను బంధం చేసుకోవడంలో నేటి మానవుడు విఫలమవుతున్నాడు. మనిషిగా అన్నీ బంధాలతో అన్యోన్యంగా వుండే ముందు, తన అంతరంగంతో, తన ఆత్మతో బంధం ఏర్పరచుకోవాలి. అప్పుడే, మానవుడు ఎన్ని బంధాలనైనా కలుపోగలుగుతాడు. కలిసి జీవించగలుగుతాడు. స్వార్ధానికి చోటు లేని, త్యాగానికి చిరునామాగా నిలిచి, వాస్తవంలో బతకాలనే ఆలోచనలతో, పరిస్థితులను సానుకూల దృక్పథంతో తీసుకునే బాధ్యత గలిన వ్యక్తులు, తనతో తాను బంధం కలిగిన మనసున్న మనుషులు తృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. -బి రాధిక