bharata currency notelu raddu

భారత కరెన్సీ నోట్ల రద్దు

భారత కరెన్సీ నోట్ల రద్దు

భారత కరెన్సీ నోట్ల రద్దు 500, 1000 రూపాయల నోట్ల రద్దు అన్నది భారత ప్రభుత్వం అవినీతిపై పోరాడేందుకు, నల్లధనం సమస్యలు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయం. 2016 నవంబరు 8 అర్థరాత్రి నుంచి మొదలుకొని అన్ని 500, 1000 రూపాయల నోట్లు చట్టబద్ధమైన మారక విలువను కోల్పోతాయి. 2016 నవంబరు 8న జాతిని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగం ద్వారా దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రకటనలో మోడీ 500, 1000 రూపాయల బ్యాంకు నోట్లను చెల్లనివిగా ప్రకటించి, కొత్త 500, 2000 రూపాయల నోట్లు చెలామణిలోకి వచ్చినట్టు ప్రకటించారు. ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా మారిన దొంగనోట్ల మాఫియాను, దేశంలోని నల్లధనాన్ని దెబ్బతీసేందుకు ఈ చర్యలు చేపట్టారు. దాని ప్రకటన జరిగిన వెంటనే ఆర్.బి.ఐ. గవర్నర్ చలామణిలో ఉన్న 500, 1000 నోట్లను మార్చుకునే విధానాన్ని పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.[3] నవంబరు 8న 500, 1000 రూపాయల…
Read More