హాని చెయ్యని దయ్యం
హాని చెయ్యని దయ్యం నేను చుట్టూ ఎక్కువ ఇళ్ళు లేని ఇంట్లో నివసిస్తున్నాను. అలాగే పర్యావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ చాలా చెట్లు ఉన్నాయి గ్రీనరీ కూడా ఎక్కువే. ఇక్కడికి వచ్చినవారు వెళ్ళడానికి ఇష్టపడరంటే నమ్మండి... నా ఇల్లు చాలా పెద్దది మాది నలుగురు సభ్యుల కుటుంబం. పెద్ద ఇంట్లో తక్కువ మంది ఉంటె ఆ ఇంట్లో కచ్చితంగా ఎదో దయ్యం ఉంటుందని చాలామంది నమ్ముతారు. కానీ నా నమ్మకం ఏంటంటే, ఇలాంటి ఇళ్ళల్లో దయ్యాలు ఉండవని. కానీ ఆ విషయం నిజమే నాని నాకు ఈ సంఘటన వల్లె తెలిసింది. కొన్ని నెలల క్రితం మేమంతా విహారయాత్రకు వెళ్లి బాగా అలసిపోయాం. దాదాపు మధ్యాహ్నం 2:00 గంటలైంది. నేను నా మంచం మీద పడుకున్నాను. నేను నిద్రలోకి జారుకుంటున్నాను, నా కళ్ళు మూసుకున్నాయి. నా తలపై ఎవరో నిమురుతునట్టు అనిపించింది. నా నుదిటిపై ఉన్న ఒక చేయి, నేను…