భోగి రోజున పిల్లల నెత్తిన రేగి పండ్లను పోయడం వెనుక ఆంతర్యం ఏమిటి?
భోగి రోజున పిల్లల నెత్తిన రేగి పండ్లను పోయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇలా చేయడం వల్ల లభించే ప్రయోజనాలేంటి ? 🍒తలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును 'భోగి'గా పిలుస్తారు. రెండో రోజును 'మకర సంక్రాంతి'గా, మూడో రోజును 'కనుమ'గా పిలుస్తారు. నాలుగో రోజును 'ముక్కనుమ' అంటారు. 🍒సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయడం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. భోగి రోజు చేసే బొమ్మల కొలువు,…