నేను.. నా సంక్రాంతి
నేను.. నా సంక్రాంతి అచ్చమైన తెలుగు పండుగ.. అందరూ జరుపుకోవాలి నిండుగ.. తెలుగు భాష అభివృద్ధి చెందాలి మెండుగ.. అద్భుతమైన సంక్రాంతి.. ప్రతి ఇంటా వెల్లి విరిసెను ఆనందాల కాంతి.. మూగబోయిన పల్లెకు మైకులతో మాటలు . డూ డూ బసవన్నల డాన్సులు.. రంగురంగుల రంగవల్లులు.. చుక్కలను తాకేంతగా గాలిపటాల పోటీలు.. ముద్దుకే ముద్దొచ్చే అతివల అలంకరణలు.. పిండి వంటల ఘుమఘుమలు.. భూజనంబులు మెచ్చు భోజనములు. మైమరిపించే ఆతీథ్యాలు. ప్రేమానురాగాలు పంచే ఆత్మీయతలు.. పల్లెల శోభ అనిర్వచనీయం.. బంధువుల కలయిక ఆనందనీయం చిన్నపిల్లల ఆటపాటల కేరింతలు.. అవి చూసి పెద్దవాళ్ల మనసులో కలిగిన హాయి పులకింతలు.. అలుముకున్న వసుదైక కుటుంబ ఛాయలు.. నా ఊరు అని మదిలో కలిగిన భావనలు.. ఎంతో గొప్పవి మన పండుగలు మరెంతో గొప్పవి మన సాంప్రదాయాలు.. అందుకే సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవించు వేద శాస్త్ర సారాలను అనునయించు మంచి మనిషిగా జీవించు.. భారతీయుని గా గర్వించు..…