నువ్వు నేను
నువ్వు నేను ప్రియమైన శ్రీవారికి ప్రేమతో మీ అర్ధాంగి వ్రాయు ప్రేమలేఖ. ఇదేదో కొత్తగా ఉంది నాకే, భర్తకు ప్రేమలేఖ రాయటం. కానీ ప్రేమలేఖ ప్రేమించే వారికెవరికైనా రాయొచ్చు అని నా నమ్మకం అందుకే ఇలా..! చెప్పడం కంటే రాయడమే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నాకు. ఇందులో రాసే ప్రతి మాట నా మనసు పొరల్లో నిండిన మీ జ్ఞాపకాల నుండి వచ్చినవే. మీ ముందు ఎదురు పడి చెప్పే ధైర్యం లేదు ఎందుకంటే మిమ్మల్ని చూసిన మరుక్షణం నా గొంతులో మాటలే తప్ప మనసులో భావాలు పలకలేను కాబట్టి. నా జీవితంలో మొదటి సారిగా వ్రాస్తున్న ప్రేమలేఖ ఇదే తప్పులుంటే మాన్నిస్తారని ఆశిస్తూ... మిమ్మల్ని పెళ్లిచేసుకొనే వరకు ప్రేమంటే తెలియదు నాకు, నిజం చెప్పాలి అంటే మీరు నా జీవితంలోకి వచ్చిన తరువాత కూడా కొంత కాలం వరకు తెలియలేదు అనే చెప్పాలి. కానీ మన ఈ 5 సంవత్సరాల…