pelli 2022

పెళ్లి 2022

పెళ్లి 2022 1986 వ సంవత్సరం అభివృద్ధి చెందుతున్న చిన్న గ్రామం. ఆ గ్రామం లో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న రాజారామ్ కొడుకు శేఖరంకి డిగ్రీ అయిపోగానే మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది రెవిన్యూ డిపార్ట్మెంట్ లో .. కొడుక్కి ఉద్యోగం దొరకడం తో శేఖరం తండ్రి రాజారామ్, శేఖరం తల్లి రామలక్ష్మి కొడుక్కి పెళ్లి సంభందాలు చూడటం మొదలెట్టారు. శేఖరం తండ్రి ఉపాద్యాయుడు అవడం వల్ల శేఖరాన్ని మంచి క్రమశిక్షణతో పెంచాడు. శేఖరం ఎప్పుడు వాళ్ళ తల్లి తండ్రులని ఎదిరించింది లేదు. తనకు BSC కెమిస్ట్రీ చదవాలని ఉన్నాప్పటికీ తండ్రి ఆదేశించడం తో బీఎస్సీ బోటనీ తీసుకున్నాడు. శేఖరం కోసం రాజారామ్ సంభందాలు చూస్తున్నాడు అని తెలుసుకున్న ఆ ఊరి పెళ్లిళ్ల పేరయ్య రాజారామ్ ని తాను పని చేస్తున్న పాఠశాల దగ్గరకు వెళ్లి కలిసాడు మధ్యాహ్నం భోజనాల సమయం లో... ************ నమస్తే రాజారామ్…
Read More