ప్రేమ + బాధ్యత = సైనికుడు
ప్రేమ + బాధ్యత = సైనికుడు ఒక ఆదివారం మా నాన్న గారి దగ్గరకు బాల్ సింగ్ అనే అతను వచ్చాడు. మా నాన్నగారు ఉద్యోగ రీత్యా మెదక్ జిల్లా లోని ఒక మండలం లో ప్రభుత్వ ఉపాధ్యాయులు గా పని చేస్తున్నారు. ఆ మండలంలో గిరిజనులు ఎక్కువగా ఉండేవారు. అయితే నాన్న గారు వారికి ఎలాగైనా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో కొందరికి ఆర్మీ లో ఉద్యోగాలు పడినప్పుడు చెప్పారు. పదవ తరగతి అర్హతతో వాళ్ళు ఆ ఉద్యోగాలను సంపాదించారు. ఆ విషయం విని బల్ సింగ్ నాన్నగారి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. వారి సంభాషణ ఈ విధంగా సాగింది. సార్ నేను ఆర్మీ లో జాయిన్ అవ్వలని అనుకుంటున్నాను సార్ అన్నాడు బాల్ సింగ్. అక్కడికి ఎందుకురా, అసలే తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకువి వాళ్ళను వదిలేసి ఆర్మిలోకి వెళ్లడం ఎందుకురా అన్నారు నాన్న. ఏం ఒక్క కొడుకును సార్ ఒక్క…