radio day

మనసుకు ఆహ్లాదాన్నిచ్చే రేడియో

మనసుకు ఆహ్లాదాన్నిచ్చే రేడియో అందరికీ ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు.2012లో తొలిసారి యునెస్కో ఫిబ్రవరి 13న ఈ ఉత్సవాలకు తెరతీసింది.రేడియో ఆవిర్భవించి వందేళ్ళు దాటినా సరిగ్గా 1920-45 మధ్య కాలంలో బాలారిష్టాలను దాటి రేడియో పూర్తిస్థాయి ఎలక్ట్రానిక్ మీడియం గా రూపొందింది. మనిషి గళం ఏకకాలంలో అనేకమందిని చేరటం అనే ప్రక్రియ మొదలైంది.జనబాహుళ్యానికి వినోదాన్ని, సమాచారాన్ని అప్పటికప్పుడు ఇచ్చే గొప్ప సాధనంగా అవతరించింది.. అలా మార్కోని కనుగొన్న మాధ్యమం ప్రజలకు చేరువయింది. ఒక ఆశ్చర్యం, సంభ్రమాన్ని కలిగించిన రేడియో విస్తరణ మొదటి ప్రపంచ యుద్ధానంతరం మొదలయ్యింది. ఔత్సాహికుల నిరంతర ఆసక్తితో ప్రసారాలు అప్పటి ప్రభుత్వాలకు ఇబ్బంది కలిగిస్తూ ఉండేవి. ఆ స్టేషన్లన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రసారాలు చేస్తుండేవి. దీనికి భిన్నంగా రోటర్ డాం (నెదర్లాండ్స్) లో 1919నవంబర్ 6న ప్రసారాల సమయ, చిరునామాలను వెల్లడి చేస్తూ మొదలయ్యాయి. ఇక 1920-21లో అమెరికన్ నగరాల్లో ముప్ఫైకి పైగా స్టేషన్లు పురుడుపోసుకున్నాయి.…
Read More