vadulaina bondu vesenu bandhaniki peethamudi bhagam 1 aksharalipi

వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!! (భాగం -1)

వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!! (భాగం -1) విశాలమైన క్రీడా మైదానము. ఒక ప్రక్క ఆహ్లాదంగా తీర్చిదిద్దిన పూదోట. దాన్ని ఆనుకొని అన్ని హంగులతో ఏర్పాటు చేయబడిన ఈతకొలను. ఆ క్రీడ మైదానానికి హృదయ స్థలంలో నడుపబడుతోంది ఒక డిగ్రీ కళాశాల. వాసు, ఆనంద్ ఇద్దరు మంచి స్నేహితులు. విరామసమయంలో స్నేహితులు అందరూ కలిసి క్రికెట్ ఆడడం వారికి అలవాటు. ఇది వారి దినచర్య. అందరూ పైసలు జమ చేసుకొని క్రికెట్ బ్యాట్ కొనేవాళ్ళు ఆ రోజుల్లో. 150 రూపాయలు వెచ్చించి బ్యాట్ కొనాలంటే గుండెలు ఆవిరైపోయేవి . ఒకరి డబ్బే కాదు కాబట్టి ధైర్యంగా బ్యాట్ కొట్టేవాళ్ళు. ఆనంద్ మంచి పేస్ బౌలర్. చూడ్డానికి సన్నగా ఉన్నా, వాడికి అంత విసురు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ అర్థమయ్యేది కాదు. అందరం ఆశ్చర్య పోయే వాళ్ళం. 'ఇప్పుడు బౌలింగ్ ఆనంద్ ది', అని వినగానే ముందు స్ట్రైకర్స్ గార్డ్…
Read More