అంధకారంలో ఆశాజ్యోతి

అంధకారంలో ఆశాజ్యోతి

అంధకారంలో ఆశాజ్యోతి

గుభాళించిన పూవుల కన్నా అందమైనది సున్నితమైనది ప్రేమ,,,,,,
కళల పూదోటలో రకరకాల పూవులు పూస్తాయి
కొన్ని బహుఅందమైనవి,కొన్ని మామూలువి, కొన్ని కళ వెలిసిపోయిన పూవులు పూస్తాయి అవి అన్నిటితో పాటు తనకున్న వెలుతురును చిందిస్తాయి,,,,,,,,
మనుషులలో అందరికి అన్ని అవయవాలు పుట్టుకతో సరిగా ఏర్పడకపోవచ్చు లేక లోపించవచ్చు అంతమాత్రాన చిన్నచూపు చూడకుండా వాళ్ళలో గుప్తంగా వున్న కళను జాగృత పరిస్తే మహోజ్వలమైన జీవం ఉట్టిపడుతుంది,,,,,,,
కొందరు పుట్టుకతో అంధులు ఉంటారు సరియైన ప్రేమ ఆదరణ లేక తమలో తాము ఆత్మన్యూనతా భావంతో కుమిలిపోతూవుంటారు,,,,,,,,
వీళ్ళకు సరియైన ప్రేమ ఆదరణ లభిస్తే అద్భుతమైన ప్రతిభ రూపుదిద్దుకుంటుంది,,,,,,,
మంచి మంచి గాయకులు, సంగీత విద్వాంసులు లాంటి కళాకారులు, ఉన్నత విద్యానభ్యసించగలిగే జ్ఞానులు వెలుగులోకి వస్తారు,,,,
వీళ్ళ కళలను ప్రతిభను వెలికితీసే ఆత్మీయమైన ప్రేమ రూపసులుంటే చాలు,,,,,,,
తీగలు సరిచేసి వీణను మీటినట్లు నిజమైన ప్రేమతో వీళ్ళల్లో జ్ఞానతృష్ణ రగిలిస్తే హృదయం లోంచి ఉజ్వల కెరటాలు ఉప్పొంగుతాయి,,,,,,,
మనిషి అందం అంతరాత్మలో ఉంది, భౌతికంగా లేకున్నా,,,,,,

అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *