అగ్నిపూవుల జీవితం

అగ్నిపూవుల జీవితం

అగ్నిపూవుల జీవితం

అతి చిన్నవయస్సులోనే అంధకారం కమ్మేసి దుఃఖితున్నై,,,,,,,
లోకం తెలియని దురలవాటులో కొట్టుమిట్టాడుతూ రెండు కళ్ళల్లో జిల్లేడు విషంపాలు పోసుకుని తెలియని మనస్సు కకావికలమై మంటల్లో దగ్దమయ్యాను,,,,,,,,
ఈ రాక్షసులు ఒక్కరంటే ఒక్కరు నేను వెళ్ళేదారి ముళ్ళదారని కాలనాగు బుసకొట్టి కాటేసే భయంకరమైన దారని ఆ చిన్నతనంలో చెప్పేవారు లేక, దారిలోపెట్టేవారు లేక ఎంత తల్లడిల్లిపోయానో నా జీవితానుభవానికెరుక,,,,,,,,
నాలోని వాస్తవమైన మనిషి చిన్నప్పుడే చనిపోయాడు,,,,,,,
ఆ అవాస్తవిక జీవితం కొనసాగింపులో నాలో నేను కుమిలిపోతూ కమిలిపోతూ ఎర్రెర్రని అగ్నిపూవులు అన్ని కాలాల్లో పూస్తూనే ఉన్నాయి,,,,,,
జీవితం మొత్తం అగ్గిమంటల తల పోట్లు, ఆలోచనలు అగ్ని సముద్రాలలో ఎగసిపడే కెరటాల అగ్గిగాలుల తుఫానుల్లో అల్లల్లాడిన మనోమంథనమే,,,,,,
చదువుకున్న నాలోని విజ్ఞత నేర్పిన జ్ఞానమే ఒకింత ప్రశాంతతకు దారితీసింది,,,,,,
ఎంత మంచిపేరు తెచ్చుకున్నానో అంతకు పదింతలు చెడుపేరుతో సమాజంలో నిలబడలేని బలహీనమైన మనస్సు ఓ అగ్నిపూవు,,,,,,,,,,
నేను చదివిన చదువులన్నీ నీళ్ళమూటలయ్యాయి అయినా కొంత సాహితీ సంపర్కముతో మీ ముందున్నాను,,,,,,,
నాకు ఉద్యోగం రావడం వెనుక ఎన్ని నిశిరాత్రుల అగ్నిగోళాలు కూలిపడ్డాయో ఆ సరస్వతీ మాత అనుగ్రహమే లేకుంటే నేను మీముందు ఉండేవాడిని కాను,,,,,,
ఈ నా జీవితం అక్షరీకరణ కోసమే మిగిలానేమో,,,,,

అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *