అభ్యాసం విజయ రహస్యం
సంస్కారం అమూల్యము
సంపదల కన్నా
సహకారం మంచిది
అన్నింటిలో మిన్న
భూషణమే వినయము
నాశనమే గర్వము
ఏది కావాలో!
నీదే తుది నిర్ణయము
మంచితనం ముత్యము
కాపాడును సత్యము
రెండూ ఉంటేనే
జీవితాన గౌరవము
ఉండాలి ఆశయము
చేయాలి అభ్యాసము
ఇక అన్నీ సాధ్యము
చేకూరును విజయము
కోటేశ్వరరావు ఉప్పాల