సాంబశివయ్య

ఈ బాలకుడు శివుని మరోరూపం,,,,,!

ఈ బాలకుడు శివుని మరోరూపం,,,,,!

ఎర్రని నిప్పులు పూసినట్లు కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ
జుట్టు ఎగదన్నగా శివాలెత్తి ఊగిపోతూ ఎచ్చటికోయ్ నీ పరుగులు,,,,,,,,,
శూలం లాంటి ఈటె చేతబట్టి ఉగ్రమహోగ్రరూపునివై దూసుకెళ్లే బాలకుడా,,,,,,,,,,
ఏ జయ జయ మంటల సుడిగుండాలు నీ నుదుటిన వీరతిలకం దిద్ది పోరుబాట పట్టించారో ,,,,,,,,,,
నీవు నిరంజనునివై ఆ దేవదేవుడు కన్న కలల స్వప్నానివై దుశ్శాసనులపై దునుమాడుతూ సాగిపోయే సింహం కూనవా ఏమి,,,,,,,,,,
కాషాయ రంగులో విజయదశమి లక్ష్మీ పుత్రునివై త్రిశూలంతో సంహరించిన మహిషాసురుని ఘోష పిక్కటిల్లేలా దూసుకెళుతూ,,,,,,,,,,,
శివతాండవం చేస్తూ దుష్టుల మెడలు వంచి కాలగర్భం మింగేలా ఉరుముతున్న పిడుగా,,,,,,,,
నీ లక్ష్యం చాలా గొప్పదిరా చిన్నా కానీ నీవు బాలకునివి నీవు నీవుగా ఎదిగి యువకిషోరునివయ్యాక జనజీవనంలో దుష్టులను ఏరివేయి సామరస్యంగా,,,,, శాంతించు,,,,, బాలశివా,,,,, శాంతించు,,,,,,,!!

అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *