కళ్ళు బైర్లుకమ్మే కొత్త సంవత్సరం
కొత్త సంవత్సరం
కుర్రకారులో రంగు రంగుల ఆశల చిగురింతలు
రాత్రి గడిచి తొలిపొద్దు పొడవగానే కాలం మార్పు,,,,,,
ముఖ్యంగా కుర్రకారు రాత్రుళ్ళు కొత్తసంవత్సరం విందు వినోదాల్లో తేలియాడుతూ గమ్మత్తైన హాయి,,,,,
ఆశలు ఆర్భాటాలతో రాత్రుళ్ళు నిద్రలుగాచి తాగుళ్ళు తిండ్లు
అర్ధరాత్రి నిర్ణీత సమయానికి ఉరకలేసే ఉత్సాహం టపాసుల చప్పుళ్ళు,,,,,,,
టీవీలు సెల్ ఫోన్ ల నిండా కాకమ్మ కబుర్లా కాదు ఆడమగ చిందులు హోరెత్తించే పాటల కోలాహలం,,,,,,,
సంవత్సరం మారేది అంకెళ్ళో మరి, కాలం మహిమ సుమీ,,,,,,
ఉద్యోగులకు సెలవు దినం అంతేనా
రంగు రంగుల సీసాలు చికెన్ మటన్ సోడాలు మందులోకి,,,,,,,
ఆకాశంలో నక్షత్రాలు చంద్రకళలు మబ్బుల దోబూచులాటలు అన్నీ మత్తుమబ్బుల్లో కొట్టుకుపోతున్న భ్రమలు,,,,,,,,,
ఆడంగులు మేమేం తక్కువ కాదంటూ కిట్టీ పార్టీల హంగామా పిల్లా పెద్ద,,,,,,,,
గాలి కబుర్లు చెప్పుకుంటూ తెల్లవార్లు పూటుగా కాలక్షేపం ఇదే మంచి తరుణమని,,,,,,,,
వేకువపొద్దున ఒక్కడూ నిద్రలేవడు సూర్యోదయం అయ్యి బారెడు పొద్దెక్కినాక ఆవులింతల్లో అయిపోయింది న్యూ ఇయర్,,,,,,
ఆవల పల్లెటూళ్ళలో కష్టించి పనిచేసే జనం గుండెల నిండా గూడుకట్టుకున్న దుఃఖంతో జీవిత పోరాటం,,,,,,,,,,
అపరాజిత్