ప్రేమ ఊసుల పావురాలు….!!
ఓ పావురమా ఓహో పావురమా,,,,
లేత లేత చిగుళ్ళ మునిమాపుల్లో
ఇద్దరు ఒకటైన సరస సంగమంలో
లోకమెల్ల నిదుర మబ్బుల జాములో
పావురాలు జతకట్టే వేళ పిల్లగాలులు సన్నాయి పాడే తరుణం,,,,,,,
హృదయాలు అల్లుకుపోయిన ప్రేమలతలై గాలి తెమ్మెరలకు ఊగుతూ,,,,,,,,,,
ఆకుపచ్చని ప్రకృతి ఒడిలో ప్రేమలు పక్వమైన మలిమాపు,,,,,,,,,,
నిశ్శబ్దం చీకటి ముసుగులో గుసగుసల అలికిడిలో జామురాత్రి దాకా జాగారం నిలువెల్లా పులకరింతలు,,,,,,,,,,,,
ఊహలు ఊయలలూగుతూ రసాత్మకమైన రాగాలలో పెనవేసిన అనుబంధాల గుడి గంటలు,,,,,,,,,,,,,
ప్రేమ పక్వమై మైమరపించే ఇరు హృదయ స్పందనలు ఒక్కటై తూరుపు తెల్లవారు జామున కబుర్లు చెప్పుకునే ప్రేమాయణం దూకే జలపాతం,,,,,,,,,,,,
ఆడపక్షి తన ప్రేమ సాఫల్యానికి ప్రతిరూపంగా అండాలపై పొదిగితే మగపక్షి ఆహార పానీయాలందిస్తూ పెనవేసిన బంధాల తొలిపొద్దు,,,, ,,,,,,,,,,,
చిరుచిరు పిచ్చుకలు కేరింతలు కొడుతూ తమ కలల పంట పండిన వేళ ఒకరికొకరి ప్రేమ పదింతలైన వేళ,,,,,, ,,,,,,,
తమ పిల్లల ఆహారంకై గగణ వీధిలో చెరోవైపు ఎగిసిపోతూ తమ కుటుంబం భాద్యతలో మునిగే వేళ గోరుముద్దలు తిన్న పిల్లపక్షులే మరి,,,,,,,,,,,,
మురిపాల పాపలు ఎదిగి తల్లిదండ్రులకు తాము పెద్దవాళ్ళు అయ్యాం అంటూ స్వేచ్ఛగా ఎగిరే తీరు తల్లిదండ్రులకు తమ ప్రేమప్రతిరూపాలను చూసుకుంటూ జీవితం అమృత తుల్యం అయిన భావన,,,,,,,,,,,,,
అపరాజిత్