సాంబశివయ్య!!
1️⃣
శివుడే మా దైవమనుచు
శివరాతిరిరోజు చంద్ర శేఖర మూర్తిన్
శివశివ యంచును భక్తులు
శివసాన్నిధ్యమున భజన చేసిరి! కృష్ణా!!
2️⃣
శివనామమె యూపిరనుచు
శివ పంచారామములను శీఘ్రమె చేరన్
శివుడే దిగివచ్చినటుల
శివసేనలు నెదురువచ్చు చెంతకు కృష్ణా!!
3️⃣
వంచన చేయుట యెరుగని
పంచాక్షర నామధేయు పార్వతి నాథున్!
సంచిత సేవలు జేయుచు
పంచన చేరంగ నిచ్చు వరములు కృష్ణా!!
4️⃣
భక్తుల కోర్కెలు దీర్చెడి
శక్తియుతుడు సాంబమూర్తి శంకరుడతడే
ముక్తి నొసగు ముక్కంటియె
రక్తిని కట్టించు తాను రయమున కృష్ణా!!
5️⃣
గరళము మ్రింగిన శివుడే
సురగంగను భువికి పంపి శుష్కము దీర్చెన్!
తరతమ భేదము జూపక
సురనరులను గాచువాడు సోముడు కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి