నా రచనలు పూవులు
నా రచనలు ప్రాణేశ్వరి సిగలో తురుముకునే పూవులు. శతకోటి వీణలలో అంతరంగం పలికే సన్నని రాగాలు.హృదయంలో ఏదో తీయని అలజడి.విరిసిన కలువ పూవులో తేనీయల కోసం తుమ్మెదలు తాపంతో తాపత్రయం. లేత గులాబీ రంగుపూవుల చీరలో మగువ హొయలొలికించే అందాల సురభామిని. వీక్షణళ్ళో వేడెక్కిన యువకులు పాడే ప్రేమ గీతాలు అంజలిలో కుసుమాలు.ఇహలోకం మరచిన భావుకతలో కవి కవనాలు. జనం గొంతుల్లో ఓ వెర్రివాడు కవి సౌందర్యముట్టిపడే గీతాలు.
– అపరాజిత్