నీ చుట్టూ జనం నీవెవరో నీకూ తెలియని అయోమయం....!!

నీ చుట్టూ జనం నీవెవరో నీకూ తెలియని అయోమయం….!!

నీ చుట్టూ జనం నీవెవరో నీకూ తెలియని అయోమయం….!!

జనం నిండిన ప్రపంచంలో మృగప్రాయంగా జీవించడం కంటే,,,,,,,,
అడవులే లేని ఎండమావుల్లో వేగిపోతూ పరుగులెత్తే ఇసుక తుఫానుల్లో నేనెవరో తెలియనప్పుడు పరమానందం,,,,,,,,
ఏడుద్దామన్నా కన్నీటి చెమ్మరాని కఠినమైన దినాల్లో ఎవరికీ తెలియని ఏకాకి జీవితం బ్రహ్మానందం,,,,,,,,
సుఖఃదుఃఖాలు పేకమేడలంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి జీవించడం నేర్చుకోవాలి అంటూ దారులు వేస్తూ అధోపాతాళానికి తోసేసి మన్నుకప్పే నరరూప రాక్షసుల కన్నా ఎంతమేలు మునుపటి జీవితం,,,,,,,,,
అగ్ని సమీపంలో ఇనుప సంకెళ్ళు తయారీకి సమ్మెట ఊపి ఊపి కొడుతుంటే నేననుకున్నాను మనిషిని ఖైదీ చేసి బంధించడం ఎంత బాధాకరమోయని,,,,,,,,,
ఇప్పుడు నేను కోరుకునేది చెరసాలలోనే ఊపిరి ఉజ్వల శ్వాసలకు ,వేకువ కిరణాలకు ,నూతన జీవితానికి ఈ సంసార బాధరాబందీ లేని జీవన్ముక్తికి పరమపద సోపానమని నేనెరిగిన జీవితం చెబుతోంది,,,,,,,,
ఈ జనసంబంధాలు అగ్నికూపాలు నిట్టనిలువునా పాతేసినా తెలుసుకోలేని జీవన్మరణ దుఃఖిత పోరాటం కడదాకా అయినా మనకు తెలియని అయోమయం,,,,,,,,

అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *