వణుకుపుట్టిస్తున్న చలి తీవ్రత....!!

వణుకుపుట్టిస్తున్న చలి తీవ్రత….!!

వణుకుపుట్టిస్తున్న చలి తీవ్రత….!!

శరీరాన్నంతా వణుకుపుట్టిస్తున్న చలిలో ఈఅద్దం నా ముఖాన్ని పగుళ్ళుదేరిన పది తలల రావణాసురుని ముఖం లెక్క ప్రతిబింబిస్తోంది,,,,,,,
ఈ ఎండిపోయిన కొమ్మల మాటున పున్నమి చంద్రుడు చలిని రెచ్చగొట్టే వెన్నెల ఎర్రని మంటల్లా చలి ఒళ్ళంతా రంపంతో చీరేస్తూ ముళ్ల ముసుగు తన్ని నేను ఆరుబయట నిద్దరోతూ,,,,,,,,
ఈచలి ఊరు మీదబడి ఒక్కోని శరీరాన్ని గజగజ వణికిస్తూ హిమానీనదాలను చంద్రుడు ఉత్పాతంలా శ్రవిస్తున్నట్లు ఒంట్లోని సత్తువ తినేస్తూ ఈదురుగాలులు,,,,,,
ఈ చలి తీవ్రతకు చెట్లన్నీ జీవం కోల్పోయి ఆకులన్నీ రాల్చి మృత కళేబరాల్లా మ్రోడులై ఇసుమంతైనా జీవం లేని చలిలో రోధిస్తున్నాయి,,,,,,,,,,
ఆకాశం నుండి మంచుకురుస్తూ జీవుల పాలిట యమకింకరుల్లా రక్తం గడ్డకట్టే చలికి ఏడ్చేందుకు ఒంట్లో సత్తువలేక రక్తాక్షరాలు కలలు కోల్పోయిన కళలై వివర్ణమవుతూ గజగజ వణుకుతూ రాగాలుపోతున్నాయి,,,,,,,
ఆ నిప్పుల కుంపటిని తీవ్రమైన చలి ఆవరించి మంచుముద్ద చేస్తోంది ,,,,,,,,,,,
బకాసురుడు నోరు తెరుచుకుని ఊరుమీద పడ్డట్లు వణుకు పుట్టిస్తున్న చలికి తాళలేక నాలుకలు పిడచకట్టుకుపోయి ఊపిరాడకుండా చేసి ఉన్నఫలంగా మింగేస్తూ మనిషి అనేవాడు మనలేని చలిగర్జనలు,,,,,,,,,
లిఖించే అక్షరాలు చలికి వేళ్ళు వణుకుతూ వంకర్లుపోతూ పక్షవాతం వచ్చినట్లు కలం వేళ్ళనుంచి జారిపడుతోంది వివశమై ఈ సుదీర్ఘ రాత్రులు ఒక్కో అంగం పీలగా అవుతున్నాయి,,,,,,,,,
చలికి ప్రాణవాయువు అతిచల్లగా శ్వాసకోశాలను పనిచేయకుండా పిడచకట్టుకుపోతూ ఊపిర్లు మంచుపొగ వదులుతూ ఉష్ణంకై తపించిపోతున్నాయి శరీరం బయటి లోపలి అవయవాలు,,,,,,,,

అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *