ఈ అక్షరాలు అగ్నిపునీతలు
ఈ ఎర్రని ఆకాశం రక్తం గోడల మధ్య బంధీనై
ఈ చీకటి కన్నీళ్ల ఎద అద్దంలో నేను
నాకై నేను రాజులా తారనై
రగిలే ఎద కుంపటి కటి అంగం కామాగ్నిలో
అగ్నికూపం అక్షరాలు బలి తీసుకునే చీకటి ఆలోచనలు
నాకై నేనే బలియవుతూ తూరుపు బొట్టుకు కాలివేలెత్తి చూపుతూ
నగ్నపిశాచాలు కళ్ళల్లో తిరుగుతూ
చీకటి ఆలోచనలు తలంటు స్నానం చేస్తూ
నా మనస్సు ఊబిలోకి జననాంగాన్ని జోప్పిస్తూ
నాలో నేను ఐక్యమవుతూ ఆ ఇరువురు నేనై
రాముని అగ్నిపునీత సీత నేనొక్కడినై
ఆర్పేయలేని మంటల్లో ఆహుతవుతూ
నింగినిండా చుక్కలలో గోడల మధ్య శృంగారం
నేనొక్కడినే అడవిలోని రేలపూవుల సారా మనస్సు నిండా తాగుతూ మత్తుగా,,,,,,,
ఉరికొయ్యను పట్టుకుని ఊగుతూ కళ్ళు బైర్లుకమ్ముతూ గోడల మధ్య స్మశానం ప్రేమల శృంగారం జీవితం,,,,,,
తరువాయి తీరిగ్గా భగవద్గీత చప్పరిస్తూ చాయి తాగుతూ
అందాల లోకంలో పూవులు జలపాతంలో కొట్టుకుపోతూ
వన్నెచిన్నెల కలల చిన్నది కళారూపం చిత్రీకరిస్తూ
నా చెరసాల నిండా అక్షరాలు అగ్నిరాతలు ఆగిపోయే ఆఖరి ఆలోచనలు
నన్ను నేను గోముగా తల నిమురుకుంటూ ఆగిపోయిన క్షణాలు
సిలోన్ రేడియోలో రఫీ తెలుగు పాటలు వింటూ
మత్తుమాత్రలో జీవితం రంపపుకోతను మరచి నిదురిస్తూ మనస్సు ఊరడిల్లిన రాత్రులు కారుచీకట్ల కటకటాలు,,,,,,,
అపరాజిత్