ఆమ్మాయే నవ్వితే,,,,!!
వెన్నెలలు గుప్పించే చంద్రవదనీ
నవ్వులు పూవుల్లా నక్షత్రాల చమక్కుల్లా
నగవులు విరబూసిన మల్లియలు
పలువరుస తెల్లని చేమంతులు విరబూసిన చందం
నింగిలో చంద్రుని పక్క చంద్రవదనివా,,,,,,
నీ చిరునవ్వులతో కుర్రకారు మతులు పోగొట్టే కలువపూవు సౌందర్యం
ఆ ఆనందాల సోయగాలలో ఓ స్వేతజాతి చకోరి
తెలుపు నూగునూగు వెంట్రుకలు విరబోసుకుని
తెల్లని సన్నజాజులు విరబూసినట్లు దరహాసములు
ఏ దివినుండి భువికి దిగివచ్చిన అప్సరసవో
మతిపోగొట్టే నగవులతో శిల్పి తన కళతో తీర్చిదిద్దిన సజీవ శిల్పానివా,,,,,,,
ఏమి ఆ సురుచిర సౌందర్య సురభామిని
తేనెలూరు ఆ కళ్ళు మచ్చికచేసిన చిరుత కళ్ళలా
నిజంగా ముగ్దమనోహర సౌందర్యం గాంచినంతనే
కుర్రకారు మతులు తప్పి మూర్చనలుబోవుట ఖాయం,,,,,,,
మనోహరీ నగవుల నయాగర జలపాతం నురగల్లో జలకాలాడే స్వెతజాతి పుష్పమా ,,,,,,,,,,,
నీ అందాల నగుమోముకు ఇదే నా సెల్యూట్
– అపరాజిత్