అప్పుడే సమాజం బాగుపడుతుంది
పిల్లల పెంపకంలో ఆధునిక తల్లి తండ్రుల పాత్ర..
నిజంగా ఈ కాలంలో నేటి సమాజంలో పిల్లలను పెంచడం చాలా కష్టంగానే ఉంటుంది..దానికి
ఒకరిద్దరినే కనడం ఓ కారణమైతే నేటి ఆధునిక సాంకేతికత ఓ కారణమవుతుంది..
పిల్లలు అన్ని రకాల ఫోన్లు అన్ని రకాల సామాజిక మాధ్యమాలు వాడుతూ చెడి పోతున్నారు అది మానసికంగా శారీరకంగా కూడా!
వావి వరుసలు మరచి పోతున్నారు దానికి తల్లి తండ్రులు కూడా ప్రోత్సాహమిస్తున్నారే తప్ప దండించడం లేదు ఎందుకంటే ఎక్కడ పిల్లలు ఏ అఘాయిత్యాలు చేసుకుంటారోనని భయపడి..
కానీ ముందు నుండే గారాబం అతిగా చేయకుండా క్రమ శిక్షణ తో పిల్లలను పెంచగలిగితే బాగుంటుంది..వారి జీవితం తప్పు దారిన పడకుండా ఉంటుంది.
ఆ బాధ్యతను తల్లి తండ్రులు గురువులు తీసుకోవాలి!
అప్పుడే సమాజం బాగుపడుతుంది…
– ఉమాదేవి ఎర్రం