aksharalipi

2720 Posts
ముక్కోటి ఏకాదశి

ముక్కోటి ఏకాదశి

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున…
Read More
ఆదిమానవుడు

ఆదిమానవుడు

ఆదిమానవుడు ఎప్పుడైతే అగ్నిని కనిపెట్టి తను తినే పదార్థాలను వేడివేడిగా తింటున్నప్పుడు ఆ ఉష్ణం తగులుతున్నప్పుడు, అది ఒక లేహ్యంలా పనిచేసింది. గొంతులోని స్వరతంత్రులు వికసించాయి. వాటితో పాటు వినికిడి నాడులు పనిచేసి తన చుట్టూర వస్తున్న శబ్దాలను వినగలిగాడు.ఆ వినికిడితో పాటు కాలక్రమంలో మాట అనేది ఉద్బవించింది.నెమ్మది నెమ్మదిగా తన అవసరాల కనుగుణంగా మాట్లాడటం మొదలయ్యింది. ఆది మానవుని మొదటి దైవాలు సూర్యచంద్రులు. ఆలోచనలు ఉద్బవిస్తూ తినే తిండి మార్పిడి, చరించే ప్రదేశాలను బట్టి ,వాళ్ళ మధ్య ఘర్షణలు,వాతావరణంలో భీకర స్థితిగతులను బట్టి రకరకాల దేవుళ్ళు ,దయ్యాలు, సైతాన్ లు ఉద్బవించారు. తాను దైవాన్ని నమ్మడం దగ్గర నుంచే కట్టుబాట్లు ,నియమ నిబంధనలు ఏర్పడ్డాయి. మానవ అస్తిత్వం పురోగతి సాధ్యపడింది. అపరాజిత్సూర్యాపేట
Read More
రిజాల్ డే (ఫిలిప్పీన్స్)

రిజాల్ డే (ఫిలిప్పీన్స్)

రిజాల్ డే ( స్పానిష్ : డియా డి రిజాల్ , ఫిలిపినో : అరావ్ ని రిజాల్ ; తగలోగ్: [riˈsal] ) అనేది ఫిలిప్పీన్స్ జాతీయ హీరో అయిన జోస్ రిజాల్ జీవితం మరియు పనిని స్మరించుకునే ఫిలిప్పీన్ జాతీయ సెలవుదినం . మనీలాలోని బాగుంబయాన్ (ప్రస్తుత రిజాల్ పార్క్ ) లో 1896లో రిజాల్‌ను ఉరితీసిన వార్షికోత్సవాన్ని ప్రతి డిసెంబర్ 30న జరుపుకుంటారు. రిజాల్ దినోత్సవాన్ని మొదట డిసెంబర్ 20, 1898 నాటి డిక్రీతో ప్రారంభించారు, బులాకాన్‌లోని మలోలోస్‌లో అధ్యక్షుడు ఎమిలియో అగ్యునాల్డో సంతకం చేశారు , డిసెంబర్ 30, 1898ని రిజాల్ మరియు ఫిలిప్పీన్స్‌లోని స్పానిష్ వలస పాలన బాధితులందరికీ జాతీయ సంతాప దినంగా జరుపుకుంటారు. డేట్ , కామరైన్స్ నోర్టే ఈ డిక్రీని అనుసరించిన మొదటి పట్టణం, సాన్జ్ మరియు లెఫ్టినెంట్ కల్నల్ ఆంటోనియో సాన్జ్ రూపొందించిన స్మారక చిహ్నాన్ని నిర్మించారు, దీనికి సాన్జ్…
Read More
డిసెంబర్ 30 ప్రత్యేకతలు :⁠-

డిసెంబర్ 30 ప్రత్యేకతలు :⁠-

✒ 1879: ఆధ్యాత్మికవేత్త భగవాన్‌ రమణ మహర్షి జననం (మ.1950). ✒1887: కొప్పరపు సోదర కవుల లో ఒకరైన కొప్పరపు వెంకటరమణ కవి జననం (మ.1942). ✒1968: ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శి ట్రిగ్వేలీ మరణం (జ.1896). ✒1971: భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు విక్రం సారాభాయ్ మరణం.(జ.1919). ✒1973: తెలుగు సినిమా నటుడు చిత్తూరు నాగయ్య మరణం (జ.1904). ✒1975: అమెరికన్ ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ జననం. ✒2006: ఇరాక్ మాజీ అధ్యక్షుడు, సద్దామ్ హుసేన్ కు ఉరిశిక్ష. (జ.1937). మాధవి కాళ్లసేకరణ
Read More
మన గౌరవం,మన ప్రాముఖ్యత

మన గౌరవం,మన ప్రాముఖ్యత

మన గౌరవం,మన ప్రాముఖ్యతమన సమస్తం, ఆత్మాభిమానం తో కూడుకున్న పవిత్రతనిలకడగా ఉండాలంటే….మనం మనదైనమన హద్దులోఉండాలి…..,!అది యేలాగంటే……ఎక్కువా,తక్కువా వద్దు….అవతల మనం గౌరవించబడాలి…!సరైన రీతిలో,సరైన రుచితోఆహారంలో ఉండవలసినఉప్పు…..ఉప్పు………లాగా,!!🩷🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి9490125878
Read More
కనువిప్పు కథ

కనువిప్పు కథ

కనువిప్పు కథ ఏమండోయ్ మిమ్మల్నే స్నానాధికాములు కానించి కాస్త తెమలండీ అనసూయ హడావిడి చేస్తోంది.పరంధామయ్య లేని ఊపిరి బిగబట్టుకుని ఏమిటే ఇవ్వాల ఇంత హుషారుగా ఉన్నావు అంటూ కుర్చీలోంచి లేచాడు.మనమ్మాయి ఐశ్వర్యకు సంబంధమొకటి పక్క ఊరిలోనే పెళ్ళిళ్ళ పేరయ్య చూశాడు. మనం వెళ్లడమే తరువాయి కట్నకానుకలు లేకుండా ఒప్పేసుకుంటారట. మనమ్మాయిని అబ్బాయి చూశాడట చాలా బాగా నచ్చిందట అంటూ అనసూయ ఏకరువు పెడుతోంది.పరంధామయ్య అనుమానంగా ఇంతకు అబ్బాయి ఏం చేస్తుంటాడు? అని అడిగాడుప్రతిదానికి మీ అనుమానం మీరూను, అబ్బాయి లక్షణంగా పట్నంలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడట అంటూ చెప్పుకుపోతోంది అనసూయ.ఎలాగైతేనేం ఎడ్ల బండిపై అనసూయ, పరంధామయ్య అబ్బాయి ఇంటికి చేరుకున్నారు.అబ్బాయి అమ్మా నాన్నలు ఎదురుగా వచ్చి సాదరంగా ఆహ్వానించారు. అబ్బాయి సూటులో హీరో లా ఉన్నాడు. అబ్బాయి తండ్రి తన కుమారుడు పట్నంలో చేస్తున్న ఉద్యోగం అవీ చాలా గొప్పగా చెబుతుంటే అనసూయ ఉబ్బితబ్బిబ్బు అవుతోంది.అబ్బాయి తండ్రి తమకు కట్నకానుకలు అవసరం…
Read More
కం!!🌺🌺🌺🌺🌺

కం!!🌺🌺🌺🌺🌺

నిండుగ చీరను గట్టుచుదండిగ తిలకమ్ము బెట్ట దైవంబనిరే!మొండిగ తిరిగెడి మగువనుదండించుచు దయ్యమంద్రు తప్పక కృష్ణా!!!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!!
Read More
కళ్ళు తెరిచి విలువలు నేర్పండి

కళ్ళు తెరిచి విలువలు నేర్పండి

అక్షరరచయితలు తేదీ : 29/12/25 అంశం- నేటిపిల్లలు సామాజిక బాధ్యత శీర్షిక- కళ్ళు తెరిచి విలువలు నేర్పండి రచన: విత్తనాల విజయకుమార్హైదరాబాద్ ఈ రచన నా సొంత రచనని హామీ ఇస్తున్నాను •••••••••••••~• ఉగ్గు పాలు పిల్లలకు పోషకాహారంపోషకాహారంతోనే తల్లుల నుండి విలువలువిలువలకు మూల గురువు అమ్మేఆ పిదపే తండ్రీ గురువువూను మూల గురువు అమ్మకి ఎక్కడినుండి వచ్చాయి విలువలు!వాళ్ళమ్మో, అమ్మమ్మో, నాయనమ్మోనే కదా చెప్పుండాలి!అమ్మమ్మా నాయనమ్మలు ఇప్పుడు ఎక్కడున్నారులే!మూల గురువమ్మే కాలంతోపాటు మారిపోయిందే! ఉగ్గుపాలను తోసేసి సీసా పాలొచ్చేసే!విలువల కథలను కాదని స్మార్ట్ ఫోనులొచ్చేసే.మాటలు నేర్పించి పలికించే పలుకులు తెలుసా!మమ్మీ డాడీ అంకుల్ ఆంటీలే అన్నీనూ.అమ్మా నాన్నా అత్తా తాతాలు వినపడనే వినపడవు కదా! ఆ పలుకుల తోనే ప్లే స్కూల్లోకి ప్రవేశాలు.అక్షరం చెప్పకుండానే లక్షల రుసుములు.కాన్వెంట్లో సీటుకి పడే పాట్లు చెప్పాలా!తల్లితండ్రుల జీతాల్లో ఒకరి జీతం చదువులకే! ఉరుకుల పరుగుల వేగంతో విద్యాభ్యాసం.వంటబట్టిన విజ్ఞానాన్ని వదిలేసి మార్కులతో పోటీ.కృత్రిమ…
Read More
మన ఆలోచనలే చేసే పనులను నిర్థారిస్తాయి,,,,!!

మన ఆలోచనలే చేసే పనులను నిర్థారిస్తాయి,,,,!!

మన ఆలోచనలే చేసే పనులను నిర్థారిస్తాయి,,,,!! మనస్సులో నిగూఢంగా గూడుకట్టుకున్న భావనలు రకరకాల ఆలోచనలకు పురిగొల్పుతాయి.ఆ ఆలోచనలు మంచివి, చెడువి,దుర్మార్గమైనవి ఉంటాయి. ఆ ఆలోచనలే మనను చేతలుగా ఉసిగొల్పుతాయి.మనం వాటిని సామాజిక కట్టుబాట్లకు లోబడి సామాన్యంగా అమలుచేస్తాం.కొందరు విపరీత ధోరణులలో పెడత్రోవ బడుతూ సామాజిక విద్రోహులవుతారు.అందుకే నీవెంత జ్ఞానివైనా సమాజోద్దరణకు దారులువేసే ఆలోచనలు చేయాలి, తప్ప నీ జ్ఞానాన్ని దుర్మార్గం పట్టనీయకుండా జాగ్రత్తపడాలి. ధైర్యం,బలం కలిగిన వ్యక్తివైతే పది మందికి సహాయపడుతూ, నీ జీవితం సాఫీగా సాగిపోయే ఆలోచనలు సమాజం అల్లకల్లోలం కాకుండా ఉంటుంది. నీవు బ్రతుకు బ్రతికించు. అపరాజిత్
Read More
క్రమశిక్షణ అవసరం

క్రమశిక్షణ అవసరం

క్రమశిక్షణ అవసరం నేటి పిల్లల మనసులుస్క్రీన్‌ల వెలుగులో మునిగి…ఆకాశం కన్నా చిన్నదైపోతున్న కలలు!వేలు కదలికల్లో ప్రపంచం తిరుగుతోంది,కానీ పక్కింటి బాధ వినిపించడం లేదు;ఇది కాలపు వ్యథా కాదా?పుస్తకపు వాసన మరిచిపోయిన గదుల్లోజ్ఞానం డౌన్‌లోడ్ అవుతోంది,అనుభవం మాత్రం దూరమవుతోంది…ప్రశ్నలు గూగుల్ అడుగుతున్నాయి,కానీ మనసు మాత్రం ఎవ్వరినీ అడగడం లేదు;అది ప్రమాదం కాదా?సామాజిక బాధ్యత అంటే సెల్ఫీ కాదు,సాయం చేయడమే నిజమైన షేర్;ఇది ఎవరు చెప్పాలి పిల్లలకు?వృద్ధుడి చేతిని పట్టుకోవడం ఒక పాఠం,రోడ్డు దాటించడం ఒక విలువ,ఆకలికి అన్నం పెట్టడం ఒక మానవత్వం!పిల్లలారా…మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే కాదు,ఈ సమాజపు హృదయంలోనూ ఉంది! డా. భరద్వాజ రావినూతల
Read More