ఈ జీవన ప్రయాణం ఎందాకో,,,,!
ఒకప్పుడు నారుపోసిన వాడు నీరుపోయడా అని
దంపతులు ఏడెనిమిది మంది నుండి డజను మంది దాకా సంతానం కనేవారు,,,,,,
అప్పుడు కరువు కాటకాలు ఆకలి బాధలు,రోగాలు దేశంలో పెచ్చరిల్లుతున్న రోజులు
జనాభ హద్దులు మీరి పెరుగుతున్న దినాలు,,,,,,,
పందొమ్మిది వందల డెబ్భై ఐదు దశకంలో
ప్రభుత్వం తేరుకుని బలవంతంగా కుటుంబ నియంత్రణ సర్జరీలు ముఖ్యంగా మగవాళ్ళకు చేసింది,,,,,,
ఇద్దరు లేక ముగ్గురు సంతానం చాలు అని సామాజిక మీడియాల్లో విస్తృత ప్రచారం చేసింది,,,,,,,
కొన్నాళ్ళకు జనజీవితాల్లో కనువిప్పు కలిగి మహోజ్వల మార్పు వచ్చింది ఆ రోజుల్లో,,,,,
అదే మార్పు తర్వాత తర్వాత ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అనే నైజం మనుష్యుల్లో సమూల మార్పుకు దోహదం చేసింది,,,,,,,
నవీన యువత భార్యాభర్తలు ఇరువురు ఉద్యోగాలు, ఊడిగాలు బిజీబిజీగా చేస్తున్న రోజులివి,,,,,
పిల్లల పెంపకం భారంగా మారిన రోజులివి, మహిళలు పిల్లలు కనే ఓపిక, సహనం నశించిపోయింది,,,,,
జపాన్, చైనాలోలా అసలే వద్దు ,ఒక్కరు ముద్దు అనే నానుడి మన దేశంలో పొడచూపుతోంది,,,,,,
కాని జపాన్, చైనా లాంటి దేశాల్లో ఇదే పకడ్బందీగా అమలు చేసిన ఫలితంగా,,,,,
ఒక పదిపదిహేను ఏళ్లకు వెనక్కి చూసుకుంటే దారుణంగా యువతరం అనేవాళ్ళు సన్నగిల్లి అంతా వయస్సుమళ్ళిన వాళ్ళే వాళ్ళ దేశాల్లో ఉన్నారు, దేశాల అభివృద్ధి కుంటుపడింది,,,,,,
కానీ మన దేశంలో ఆ స్పృహ ఇంకా రాలేదు
ఆడపిల్లయినా, మగపిల్లాడయినా ఒక్కరిని కాన్పునిస్తే అదేచాలు అనుకునే ఈ బిజీ జీవన స్థితిగతులు,,, ,,
ఒక్కరినే అపురూపంగా, అల్లారుముద్దుగా పెంచుదామన్నా తీరికలేని దంపతులు,,,,,
ఆ ఒక్కరికి అన్నాచెల్లి గాని,అక్కాతమ్ముడు గాని లేక ఆటపాటల్లో తోడులేక,,,,,,,
ఆ ఒంటరితనం పిల్లలకు సామాజిక విలువలు, జీవన విధానం సరిగా తెలిసిరాని అయోమయంలో పడిపోతున్నారు,,,,,,
తలిదండ్రులు పొద్దస్తమానం పనుల ఒత్తిడిలో తలామునకలవుతున్న రోజులివి,,,,,,,
ఆ ఒక్కరికి మనస్సు కకావికలమై సహజసిద్ధమైన ప్రేమ, ఆప్యాయతలు సరిగా లభించని పరిస్థితులు నెలకొంటున్నాయి,,,,
సెలవు దినాల్లో ఒక్కగానొక్క సంతానానికి నిజమైన ప్రేమ, ఆప్యాయతలు, ఆనందాన్ని ఇవ్వాలని ఎన్ని ప్రకృతి దృశ్యాల మధ్య గడిపినా తమకు తోడులేక పిల్లలు నిరాశ ,నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నది వాస్తవం,,,,,,
దంపతులు ఇరువురిలో ఒకరు బిజీబిజీ జీవన శైలిలో కొన్నికొన్ని పనులను త్యాగం చేసైనా కనీసం ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి వాళ్ళ ఆలనాపాలనా చూసుకోవాలి,,,,,,,
మనమిద్దరం మనకిద్దరు అన్న సూత్రాన్ని తూచతప్పకుండా ఆచరించాలి,,,,,,
– అపరాజిత్