పిల్లల పెంపకం లో ఆధునిక తల్లిదండ్రుల పాత్ర
సమాజం వేగంగా మారుతున్న ఈ తరుణంలో, పిల్లల పెంపకం అనేది కేవలం బాధ్యత మాత్రమే కాదు! ఒక పెద్ద సవాలుగా మారింది.
గతంలో తల్లిదండ్రులు అనుసరించిన సంప్రదాయ పద్ధతుల కంటే, నేటి ఆధునిక తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచడంలో విభిన్నమైన, సంక్లిష్టమైన పాత్రను పోషించవలసి వస్తోంది. సాంకేతికత, ఆర్థిక ఒత్తిళ్లు, మారుతున్న సామాజిక విలువలు
సంప్రదాయ పెంపకంలో తల్లిదండ్రులు నియంత్రణ ప్రధానంగా వ్యవహరించేవారు. కానీ, ఆధునిక తల్లిదండ్రులు తమ పాత్రను మార్చుకోవాలి.
వారు పిల్లలపై అధికారాన్ని రుద్దకుండా, సరైన మార్గాన్ని చూపించే మార్గదర్శకులుగా, స్నేహితులుగా వ్యవహరించాలి.
ఏ నిర్ణయం తీసుకున్నా, దాని వెనుక ఉన్న హేతువును పిల్లలకు వివరించాలి. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవాలి, తద్వారా పిల్లలు సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకుంటారు.
నేటి పిల్లల జీవితంలో సాంకేతికత అనేది ఒక అంతర్భాగం. ఇది ఆధునిక తల్లిదండ్రులపై అతిపెద్ద ఒత్తిడి.
టెక్నాలజీని పూర్తిగా దూరం చేయకుండా, దానిని ఎలా సురక్షితంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించాలో నేర్పించాలి? పిల్లలను కేవలం సాంకేతికత వినియోగదారులుగా కాకుండా, డిజిటల్ పౌరులుగా తీర్చిదిద్దాలి. చరవాణి తెరను సమయాన్ని తగ్గిస్తూ, కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి, బహిరంగ క్రీడలకు ప్రోత్సహించాలి.
ఆధునిక ప్రపంచపు ఒత్తిడి పిల్లలపై కూడా పెరుగుతోంది. విద్యాపరమైన ఒత్తిళ్లు, సామాజిక పోలికలు వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
ఆధునిక తల్లిదండ్రులు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పెంపకంలో ప్రధాన అంశంగా చూడాలి. వారి భావోద్వేగాలను అణచివేయకుండా, వాటిని ఆరోగ్యకరంగా ఎలా వ్యక్తం చేయాలో నేర్పించాలి?
పిల్లల ఇష్టాలను, ప్రతిభను గౌరవించి, వారి స్వయంప్రతిపత్తిని ప్రోత్సహించాలి. బలవంతంగా తమ నిర్ణయాలను వారిపై రుద్దకూడదు. ఆధునిక తల్లిదండ్రులు సాధారణంగా ఇద్దరూ ఉద్యోగాలు చేసేవారు కాబట్టి, వారు తమ పిల్లలకు రోల్ మోడల్‌గా ఉండాలి, అదే సమయంలో తమ పెంపకంలో సౌలభ్యాన్ని పాటించాలి.
తల్లిదండ్రులు బాధ్యత, విలువలు, ఆరోగ్యకరమైన అలవాట్లలో తాము ఆచరించి పిల్లలకు చూపించాలి.
పని ఒత్తిడిలో, పెంపకంలో తాము కూడా అలిసిపోకుండా, తమ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, తద్వారా ఓపికతో, ప్రేమతో పిల్లలను పెంచగలుగుతారు.
పిల్లల పెంపకంలో ఆధునిక తల్లిదండ్రులు కేవలం పోషకులు కాదు, వారు విజ్ఞాన ప్రదాతలు , భావోద్వేగ రక్షకులు. పిల్లలకు స్వాతంత్ర్యం ఇస్తూనే, విలువలు నేర్పాలి.
సాంకేతికతను ఇస్తూనే, సంబంధాలను పెంపొందించాలి. ఈ సంక్లిష్టమైన సమతుల్యతను సాధించగలిగితేనే, నేటి ఆధునిక తల్లిదండ్రులు రేపటి సమాజానికి బాధ్యతాయుతమైన, సంతోషకరమైన పౌరులను అందించగలరు.
– మాధవి కాళ్ల