అనువాదకుడు

వెల్చేరు నారాయణరావు (తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు)

వెల్చేరు నారాయణరావు (తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు)

వెల్చేరు నారాయణరావు (తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు) వెల్చేరు నారాయణరావు ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు. బ్రిటిషు యుగంలో భారతీయ సాహిత్యం, ముఖ్యంగా తెలుగు సాహిత్యం పాశ్చాత్య సాహిత్య పరిశోధన వల్ల ఎలాంటి ప్రథలకు లోనైందో పరిశోధించి సమగ్రమైన అధ్యయనంతో ఆ లోపాలను సరిచేసే ప్రయత్నాలు చేస్తున్న విశిష్ట పరిశోధకుడు. ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో బి.ఎ., ఆంధ్రవిశ్వకళా పరిషత్తులో ఎం.ఎ. పూర్తిచేసిన అనంతరం వెల్చేరు నారాయణరావు 1970లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లింగ్విస్టిక్స్ లో డిప్లొమా అందుకున్నాడు. అనంతరం 1971లో అమెరికాలోని విస్కామన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ లో ఉపన్యాసకునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. 1974లో ఆంధ్రవిశ్వకళాపరిషత్తు నుంచి తెలుగులో కవితా విప్లవాల స్వరూపం అంశంపై చేసిన పరిశోధనకు గాను పి.హెచ్.డి. పట్టా అందుకున్నాకా విస్కామన్సిన్ విశ్వవిద్యాలయంలోనే 1975లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, 1981లో అసోసియేట్ ప్రొఫెసర్ గా అనంతరం…
Read More
పిలకా గణపతిశాస్త్రి (కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు)

పిలకా గణపతిశాస్త్రి (కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు)

పిలకా గణపతిశాస్త్రి (కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు) పిలకా గణపతి శాస్త్రి ( జ:ఫిబ్రవరి 24, 1911 - మ:జనవరి 2, 1983) కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. 1911 ఫిబ్రవరి 24న తూర్పు గోదావరి జిల్లా కట్టుంగ గ్రామంలో జన్మించాడు. విజయనగరం సంస్కృత కళాశాలలో సాహితీ విద్యా ప్రవీణ పట్టా పొందాడు. ఆయన రాజమహేంద్రవరం ఆంధ్ర యువతీ సంస్కృత పాఠశాలలోను, వీరేశలింగం పాఠశాలలోను తెలుగు పండితుడుగా పనిచేశాడు. కవిగా, వ్యాఖ్యాతగా, నవలా రచయితగా, అనువాదకునిగా, ఆర్ష విద్వాంసుడుగా పత్రికా సంపాదకుడుగా విశేష ఖ్యాతి పొందాడు. పిలకా గణపతి శాస్త్రి ఆంధ్ర శిల్పి, ఆంధ్రభారతి, ఆంధ్రప్రభ వంటి పత్రికలకు సహాయ సంపాదకుడుగా పనిచేశాడు. గణపతి శాస్త్రిగారు జనవరి 2, 1983లో మరణించారు. రచనలు నవలలు విశాల నేత్రాలు (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి)హేమపాత్ర - విప్రనారాయణ కథ…
Read More