ఈరోజు అంశం:- సోషల్ మీడియాలో లేకపోతే?
ఈరోజు అంశం:- సోషల్ మీడియాలో లేకపోతే? సోషల్ మీడియాలో లేకపోతే జనావాసాలకు దూరంగా ఉన్నట్టా లేనట్టా? నా అభిప్రాయం. అవును చాలా మంది సోషల్ మీడియానే తమ లోకంగా బతుకుతూ లైక్ ల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం వాటన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు అలాంటి వారిని చూస్తూ మిగిలిన వాళ్ళు మీరు లోకానికి దూరంగా ఉంటున్నారని ఎద్దేవా చేయడం ఎంత వరకు సమంజసం చెప్పండి? లోకం లో సోషల్ మీడియా కన్న చాలా విషయాలు తెలుసుకో దగినవి చాలా ఉన్నాయి అని మిగిలిన వారు తెలుసుకోలేకపోతున్నారు. లైక్ షేర్ ల కోసం కాకుండా ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే ఇవ్వన్నీ వాడకుండా ఉండటమే ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి.