అభిలాష
అభిలాష నేను పదో తరగతి పాస్ అయ్యాక ఏ కాలేజీలో చేరాలి అనే సమస్య మొదలైంది. దగ్గరలో ఏ కాలేజీ లేదు. కాలేజికి వెళ్ళాలంటే పక్క ఊరికి వెళ్లాలి. అందువల్ల నాన్న గారు పక్క ఊర్లో ఏదైనా మంచి కాలేజీ ఉందేమో అని వెతకడానికి వెళ్ళారు ఒక రోజు. అయితే అక్కడ రెండు కాలేజికి ఉన్నాయి. అందులో నాన్నగారికి తెలిసిన ఒకరి కాలేజీ బాగా అనిపించింది. దాంతో అప్లికేషన్ ఫామ్ తెచ్చారు. తెల్లారి అది నింపేసి నన్ను తీసుకుని అక్కడికి వెళ్ళాం ఇద్దరం. అప్పటి వరకూ పక్క ఊరికి ఎప్పుడు వేళ్ళని నేను అదే మొదటి సారి వెళ్ళడం కావటం చేత అన్ని వింతగా చూస్తూ ఉన్నాను. అది కొంచం పెద్ద ఊరు కాబట్టి అన్ని కార్యాలయాలు అక్కడే ఉన్నాయి. ఇక నన్ను నాన్న గారు ప్రిన్సిపల్ కి చూపించి మా అమ్మాయి బాగా చదువుతుంది అంటూ చెప్పారు. ఫీజు కూడా…