ఎవరు పార్ట్ 8
ఎవరు పార్ట్ 8 “లక్ష్మి, ఏంటి అలా మౌనంగా ఉన్నావు?” “మౌనం ఏమి ఉంది, పని చేస్కుంటున్నా, రేపే మహేష్ గారి పుట్టిన రోజు, చాలా పనులు ఉన్నాయి.” “లేదు. ఎందుకో కోపంగా ఉన్నావు” “మీ మీదా?” అవును అన్నట్టు తల ఆడించాను. “మీ మీద నాకు ఎందుకు కోపం” “కోపం లేకపోతే మొహం ఎందుకు చాటేస్తావు?” “రాయుడు గారు, నా పని నన్ను చేసుకోనివ్వండి. మీరు ఇక్కడ అధికారి, అధికారం చూపిస్తే అందంగా ఉంటుంది, అలా కాకుండా ఇలా అమ్మాయిలు మీద అనురాగాలు కురిపిస్తే ఉన్న పని, పనితో పాటు పరువు రెండూ పోతాయి.” కాస్త ఘాటుగానే మాట్లాడింది. “కనీసం ఇది అనురాగం అని అర్ధం అయ్యింది, లేకపోయి ఉంటే ఇంకా ఎన్ని అనే దానివో. వస్తాను” అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న నాకు అద్దంలో నన్ను తను చూస్తున్నట్టు కనిపించింది. ఈ అమ్మాయి అర్థం కాదు. ఎందుకు ఇలా…