మనసంతా నీవే సఖి
మనసంతా నీవే సఖి కమ్మని స్వప్నాలు కంటున్నా వాడని మన పరిచయాన కలగా వేడుకలెన్నో జరిగినా ఎదుట లేక ఎంతకీ తీరని తాపాలను చెలరేగనీయక అధిమిపట్టా మనసును రెప్పల మాటున దాగిన నీ రూపం కనులు తెరవనీయక అల్లరిచేస్తుంటే ఆ అల్లరి మైకంలో నవ్వుకుంటున్నా ఎన్నటికైనా నాదానవయ్యే నీకై అలుపెరుగక ఎదురుచూస్తున్నా కలగా కరిగిపోయే కాలాలని సునాయాసంగా తరిమేస్తున్నా మోయలేక భారంగా మోస్తున్న మరుపెరుగని నీ తలపుల్లో కాలమంతా కరిగించేస్తున్నా 'సఖి' - ఉమామహేశ్వరి యాళ్ల