aksharalipi naa maguva

నా మగువ

నా మగువ అవును నా మగువ ఎదుగుతుంది అవునా నా మగువ జీవిత ప్రయాణంలో మార్పు వస్తుంది..... దేవదాసీలా ఒకరికి దాసిగా ఉండే నా మగువ తన ప్రేమతో ఈ యావత్ ప్రపంచాన్ని తనకు దాసోహం అయ్యేలా మార్చుకుంది అవును నా మగువ బ్రతుకు ప్రయాణంలో మార్పు వచ్చింది చితి మంటలు చేర్చే స్మశానవాటికలో ప్రవేశం లేని నా మగువకు ఇప్పుడు ఒకరికి చితిమంటను పెట్టేదాకా నా మగువా ఎదిగింది అవును నా మగువ మీద ఉన్న అభిప్రాయంలో మార్పు వస్తుంది ఈ సమాజానికి.. పున్నాక నరకం నుంచి కాపాడే వాడు కొడుకు అనే ఆలోచన నుంచి బ్రతుకు ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి కష్టం నుంచి కాపాడేది కూతురు అనే వరకు నా మగువ జీవిత ప్రయాణంలో మార్పు వచ్చింది నాలుగు గోడల మధ్య నలిగే కాలం నుంచి నలుగురికి బ్రతుకు తెరువు చూపేలా నా మగువా ప్రయాణంలో మార్పు వచ్చింది…
Read More