ప్రపంచ రేడియో దినోత్సవం
ప్రపంచ రేడియో దినోత్సవం బూచాడమ్మా బూచాడు బుల్లి పెట్టె లో ఉన్నాడు కళ్ళకి ఎప్పుడూ కనిపించడు కథలు ఎన్నో చెబుతాడు. అంటూ మన పెద్దలు టెలిఫోన్ గురించి ఎప్పుడో పాటను రాశారు. కానీ అదే పాట మనం రేడియో కి కూడా మలుచుకోవచ్చు... అయితే చిన్నప్పుడు రేడియోకు మనకున్న అనుబంధం చెప్పలేనిది. పొద్దున్నే 6 గంటలకి వందేమాతరం తో మొదలై వార్తలు విశేషాలు దేశవిదేశాల కబుర్లు మన అందరికీ తెలిసేలా చేసేది. ఆ తర్వాత లలిత సంగీతం 11 గంటలకి తెలుగు పాటలతో అలరించేది. మళ్లీ 12 గంటలకి హిందీ ప్రసారాలు మూడు గంటల వరకు వచ్చేవి ఆ తర్వాత కొంత విరామం. ఇక సాయంత్రాలు ఏడు గంటలకు వార్తలతో మొదలయ్యి ఎనిమిది గంటలకు కొన్ని పాటలు ఆ తర్వాత తొమ్మిది గంటలకు ఇంగ్లీష్ వార్తలు వంటివి వచ్చేవి. పాత తరం వాళ్ళు రేడియో తోనే ప్రపంచంలో ఏం జరిగినా తెలుసుకునేవారు.…