aksharalipi prayanamlo padanisalu

పుష్కలంగా పుష్కరం

పుష్కలంగా పుష్కరం అవి 2003 గోదావరి పుష్కరాలు జరుగుతున్న రోజులు. మేము హైదరాబాదు నుంచి రాజమండ్రి పుష్కర స్నానాలు చేయాలని బయల్దేరాము. హైదరాబాదు నుంచి మా కుటుంబం, అన్నయ్య, స్నేహితులు ఇద్దరు మాతోపాటు బయల్దేరారు. మధ్యలో గుంటూరులో మరి కొందరు స్నేహితులు కూడా మాతో పాటు పుష్కర స్నానానికి రావాలనుకున్నారు. వారికోసం హైదరాబాదు నుంచి గుంటూరుకు ఉదయం రైలు ఎక్కాము. గుంటూరు చేరేసరికి మధ్యహ్నం అయ్యింది, తెలిసిన వాళ్ళ ఇంటిలో భోజనాలు చేశాం. సాయంత్రం నాలుగు, అయిదు గంటలకు వచ్చే వాళ్ళు అందరూ గుంటూరు బస్టాండ్ లో కలుద్దామని ముందే అనుకున్నాం. నా డిగ్రీ అక్కడే పూర్తి చెయ్యటం, స్నేహితులు అందరూ గుంటూరు వారే అవ్వడం, నేను వాళ్ళని కలిసి నేరుగా బస్టాండ్ కి వస్తానని నన్ను కలవటానికి వచ్చిన ఇద్దరి స్నేహితురాళ్ళతో వెళ్తానని అమ్మకు చెప్పి బయటపడ్డాం. గుంటూరులో ఉన్న ఇంకో ముగ్గురిని కలిసి వచ్చేసరికి సాయంత్రం ఆరు అయ్యింది. బస్టాండ్…
Read More

నాన్నతో నా ప్రయాణం

నాన్నతో నా ప్రయాణం నేను ఆరో తరగతిలో ఉండగా జరిగిన ఒక సంఘటన ఇది. మా నాన్నగారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఆయన పని చేసే చోట ఒక లెక్కల మాస్టారు కొత్తగా స్కూటర్ కొన్నారు. అయితే మా నాన్నగారికి ఎప్పటి  నుండో స్కూటర్ నడపాలనే కోరిక బలంగా ఉండేది. దాంతో ఆ మాస్టారు ను ఒక్కసారి స్కూటర్ ను ఇవ్వండి. కాసేపు నడిపి ఇస్తాను అని అడిగారు. కానీ ఆయన ఛత్ వీల్లేదు, అసలు నీకు బండి నడపడం వస్తుందా, నీకు బండి గురించి ఏం తెలుసు అంటూ అవమానించేసరికి నాన్నారి లో ఆవేశం కట్టలు తెంచుకుంది. దాంతో అవమాన భారంతో ఇంటికి వచ్చేసి, చాలా రోజులుగా దాచుకున్న డబ్బు కొంత, అక్కడా, ఇక్కడా అప్పులు చేసి మరికొంత డబ్బు పెట్టేసి, వారంరోజుల్లో ఒక కొత్త బండి కొనేసేసారు. ఇక దాంతో తెల్లారు ఝామున లేచి గ్రౌండ్ కి వెళ్లి పట్టుబట్టి…
Read More