aksharalipi vadulaina bondu vesenu bandhaaniki peetamudi bhaagam 3

వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!!! (భాగం -3)

వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!!! (భాగం -3) తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ బండి దిగాడు ఆనంద్. వాసు బండి వెనక్కి తిప్పాడు. ఇప్పుడు సీతకి ఎదురుగా వెళ్ళి ఆమెని పలకరించాలని, మనసులో వెయ్యి ఆలోచనలు. ఆమె బండి ఆపుతుందా లేదా పట్టించుకోనట్టు చేస్తుందా? నేను ఆమె వైపు చూడాలా వద్దా? ఈ ఆలోచనలతో ఆమెని సమీపించాడు వాసు. యధాప్రకారం ఆమెని చూడనట్టుగా ముందుకి వెళ్ళబోయాడు. కానీ, సీత చెయ్యి తో సంజ్ఞ చేసింది ఆపమని. ఇక, వీడి గుండెలో ఆనందాల రైళ్ల పరుగులు. మళ్లీ వెనక్కి తిప్పాడు బండిని. ఈసారి కాస్త హీరో లెవల్లో తిప్పాడు. ఆమె పక్కగా బండిని ఆపాడు. "ఏంటి మళ్లీ వచ్చావు వెనక్కి? ఆనంద్ ఏడి?" అని అడిగింది సీత. ఏమని చెప్పాలి? ఇరుక్కుపోయాడు వాసు. "వాడు చాయ్ తాగుతా అంటే అక్కడే దించాను" అని చెప్పాడు. "మరి నువ్వు చాయ్ తాగావా?" అడిగింది…
Read More