యోధ ఎపిసోడ్ 12
యోధ ఎపిసోడ్ 12 ఆ రోజు ఆదివారం. అప్పటికే తెల్లారడంతో, కిందపడి ఉన్న పార్దుకి మెలుకువ వచ్చింది. తన తల మీద ఎవరో కొట్టినట్లు, అంతా పట్టేసినట్లు దిమ్ముగా ఉంది. తనకి తానుగా అక్కడి నుండి లేవలేని స్థితిలో ఉన్నాడు. ఎవరి సహయాన్ని ఐనా కోరదాం అంటే, తన నోట్లో నుండి సరిగా మాటలు కూడా రావడం లేదు. చుట్టూ చూస్తున్నాడు, ఎవరూ కనిపించడం లేదు. తనలో తానే శక్తిని కూడగట్టుకుని మెల్లగా బెడ్ మీదకి చేరుకున్నాడు. అక్కడే పక్కనున్న వాటర్ త్రాగి, అసలు ఓపిక లేని పార్ధు, మంచం మీద పడుకుని, అంతకుముందు జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటూ, పదే పదే తన స్నేహితులను తలుచుకుంటూ బిగ్గరగా అరుస్తూ ఏడుస్తున్నాడు. తన స్నేహితులను కోల్పోవడానికి, చివరికి తను అలా అక్కడ అనాధగా మిగిలిపోవడానికి కూడా కారణం తనేనన్న ఆలోచన తనని వేధిస్తుంది, మరింత బాధిస్తుంది. "అవేశ్... ప్రియా... గోపాల్... గౌతమి... విశాల్...…